కరోనాకు కొత్త మందు- నోటి ద్వారా వేసుకునేలా- గేమ్ ఛేంజర్ మోల్నుపిరావిర్ ?
ప్రపంచాన్ని కరోనా వైరస్‌లు ఒక దాని వెంట మరొకటి పట్టి కుదిపేస్తున్న నేపథ్యంలో శాస్తవేత్తలు వ్యాక్సిన్లతో పాటు పలు భిన్న రకాల చికిత్సల కోసం పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో ఏ ఒక్కటి విజయవంతమైనా అది మానవాళిని కరోనాతో పాటు భవిష్యత్ వైరస్‌ల మహమ్మారుల నుంచి కాపాడుతుందని విశ్వసిస్తున్నారు. ఇదే క్రమంలో బ్రిటన్‌కు చెందిన ప్లిమత్ విశ్వవిద్యాలయం, యూఎస్‌కు చెందిన ఎన్‌ఐహెచ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. నోటి ద్వారా తీసుకునే ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తే కోవిడ్ గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్లకు ప్రత్యామ్నాయాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ మొదలయ్యాక పలు రకాల వ్యాక్సిన్ల కోసం పరిశోధనలు మొదలయ్యాయి. ఇవి తాజాగా ఫలించడంతో ఒక్కొక్కటిగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్‌లోనే రెండు దేశీయ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ అభివృద్ధి చేశారు. అలాగే అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల నుంచి ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, సినోవాక్, మోడర్నా వంటి వ్యాక్సిన్లు మార్కెట్‌ను ముంచెత్తేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు రెండేసి డోసుల చొప్పున వేసుకోవాల్సిన రావడం, అదీ అందుబాటు ధరల్లో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఓరల్ డ్రగ్ కనిపెట్టిన యూఎస్, బ్రిటన్
బ్రిటన్‌కు చెందిన ప్లిమత్ యూనివర్సిటీతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కరోనా చికిత్స కోసం వ్యాక్సిన్లకు బదులుగా నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్‌ను కనిపెట్టారు. ఎంకే-4482 లేదా మోల్నుపిరావిర్‌గా పిలిచే ఈ డ్రగ్‌ను నోటి ద్వారా తీసుకోవచ్చు. కోవిడ్ సోకడానికి 12 గంటల ముందు లేదా కోవిడ్ సోకిన 12 గంటల తర్వాత కానీ దీన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కరోనా రిస్క్‌ను భారీగా తగ్గిస్తుందట
కరోనా వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఈ మోల్నుపిరావిర్ డ్రగ్‌ను నోటి ద్వారా తీసుకుంటే ఆ రిస్క్ గణనీయంగా తగ్గిస్తుందని శాస్తవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ఇప్పటివరకూ బయటపడిన వైరస్‌లతో పాటు ఇతర వైరస్‌లపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. ప్రస్తుతం వ్యాక్సిన్లకు ఎక్కువగా ప్రత్యామ్నాయాలు లేని పరిస్ధితుల్లో ఈ ఓరల్ డ్రగ్ తీసుకోవడం వల్ల కరోనా రిస్క్ గణనీయంగా తగ్గుతున్నట్లు తాజాగా నిర్వహించిన ట్రయల్స్‌లో తేలింది. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజాకు వాడుతున్న టామీఫ్లూ టాబ్లెట్ల తరహాలోనే ఇది కూడా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ అవుతుందా ?
ఇప్పటికే అమెరికా ప్రభుత్వం రెమిడెసివిర్ డ్రగ్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో మోల్నుఫిరావిర్ వాడకం కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నారు. దీంతో రెమిడిసివిర్ కంటే ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న మోల్నుఫిరావిర్‌కు పలు ప్రభుత్వాలు అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లోనూ మోల్నుఫిరావిర్ వాడకానికి అనుమతి లభిస్తే ఇది కచ్చితంగా గేమ్ ఛేంజర్ కానుందని భావిస్తున్నారు. గతేడాది నుంచే ఈ ఓరల్ డ్రగ్‌పై పరిశోధనలు సాగుతున్నాయి. రోగులను మూడు విభాగాలుగా వర్గీకరించి ట్రయల్స్ నిర్వహించడం ద్వారా దీని కచ్చితత్వాన్ని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications