యుద్ధానికి పాక్ సిద్ధం: 'భారత్‌కు భారీ నష్టం తప్పదు'

న్యూఢిల్లీ: భారత్‌తో ఎటువంటి యుద్ధానికైనా సరే తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ రక్షణ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. భారత నేతలకు నిజంగానే యుద్ధం చేయాలని భావిస్తే, ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేడియా పాకిస్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శాంతి స్థాపనపై తమకు నమ్మకం ఉందని, అయితే దురుసుగా వ్యవహరిస్తే ఏవిధంగా సమాధానం చెప్పాలో కూడా తమకు తెలుసని ఆసిఫ్ హెచ్చరించారు.

మంగళవారం నాడు 1965 ఇండో పాక్ వార్ సందర్భంగా ట్రై సర్వీస్ సెమినార్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ మాట్లాడుతూ దేశ సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తూట్లు పొడుస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌తో చిన్న చిన్న యుద్ధాలు చేయక తప్పనిసరి పరిస్ధితి ఏర్పడిందని, అందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

'Pak prepared for war, can give befitting response to India'

హఫీజ్ సయీద్ కు ఝలకిచ్చిన లాహోర్ హైకోర్టు

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్ హైకోర్టు ఝలకిచ్చింది. భారతీయ సినిమాలు పాకిస్థాన్‌లో విడుదల కాకుండా నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పాకిస్థాన్ న్యాయస్థానం కొట్టివేసింది.

భారతీయ సినిమాలు పాకిస్థాన్ లో విడుదల కాకుండా పూర్తిగా నిషేధించాలని కోరుతూ ముంబై పేలుళ్ల సూత్రధారి, తీవ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం హఫీజ్ సయీద్ న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించింది. పాకిస్థాన్ సంస్కృతిక శాఖను సంప్రదించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+