పాకిస్థాన్ యూనివర్సిటీపై ఉగ్రదాడి: 9మంది మృతి, 32మందికి గాయాలు(వీడియో)
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో శుక్రవారం ఉదయం ఉగ్రవాడి కలకలం రేపింది. పెషావర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి ముగ్గరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, 32మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
UPDATE: Pakistani security forces were exchanging fire with the attackers of University of #Peshawar https://t.co/YnfZeAonoj pic.twitter.com/YGswsm8tv8
— RT (@RT_com) December 1, 2017
ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. విశ్వవిద్యాలయంలో వంద మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో పెషావర్ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో 100మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications