పాక్ మరో దుశ్చర్య-వాఘా గేట్ మూసివేత-బోర్డర్ లో చిక్కుకున్న పౌరులు..!
పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఇరుదేశాల గగనతలాల్ని ప్రత్యర్థి విమానాలు వెళ్లకుండా ఇప్పటికే మూసేశారు. అలాగే ఇరు దేశాలూ ప్రత్యర్థి దేశాల పౌరుల్ని వారి స్వదేశాలకు బహిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్‌లోని అట్టారీ మీదుగా వాఘా సరిహద్దు పోస్టు వద్ద గేట్లను మూసేశారు.
పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వెళ్లాలనుకునే వారు, అలాగే భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లే వారు ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దుశ్చర్యతో ఇరుదేశాల పౌరులూ ఇక్కడ చిక్కుకుపోయారు. పాకిస్తాన్ జాతీయులను సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదని భారత అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆప్ఘన్ ట్రక్కుల్ని మాత్రం భారత్ లోకి వెళ్లందుకు పాకిస్తాన్ అనుమతిస్తోంది. ఆప్ఘనిస్తాన్ తో ఉన్న సోదల సంబంధాల నేపథ్యంలో వీటిని అనుమతిస్తున్నట్లు పాక్ పేర్కొంది.

వాస్తవానికి భారత్ లో ఉన్న తమ పౌరుల్ని పాకిస్తాన్ ఏప్రిల్ 29 వరకూ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో నిన్నటి వరకూ వేచి చూసిన పాకిస్తాన్.. ఇక అట్టారీ-వాఘా గేట్ ను మూసేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన మరింత పెరిగినట్లయింది. పాకిస్తాన్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరుదేశాలకు చెందిన పౌరులు ఇక్కడ చిక్కుకుపోయారు. వీరు వెనక్కి వెళ్లలేక అక్కడే ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.
భారత్ తాజాగా పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. వివిధ కారణాలతో భారత్ లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ పౌరుల్ని తమ తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ ఇక్కడే ఉండేందుకు అనుమతించింది. దీంతో ఎమర్జెన్సీ కారణాలతో భారత్ లో చిక్కుకున్న వారికి వెసులుబాటు దక్కింది. వీరు కాకుండా మిగిలిన వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోయేందుకు మాత్రం ఇప్పుడు ఆటంకాలు తప్పడం లేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications