వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pakistan crisis : పాకిస్తాన్ లో టెన్షన్ - ఇమ్రాన్ బలపరీక్షకు భారీ భద్రత-పార్లమెంటు బయటా

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ లో ఇమ్రాన్ బలపరీక్ష నేపథ్యంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. విపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై సుప్రింకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చింది. దీంతో ఇవాళ దీనిపై పార్లమెంటులో ఓటింగ్ జరగబోతోంది.

Recommended Video

Imran Khan - No Superpower Can Dictate Terms To India | Oneindia Telugu

ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాకిస్థాన్ పార్లమెంట్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతీయ అసెంబ్లీలోని రెడ్ జోన్ భద్రత కోసం రేంజర్లు, ఎఫ్‌సి, పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైన్యం కూడా జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pakistan crisis : Tight Security outside Pakistan Parliament ahead of no-trust vote

మరోవైపు పాకిస్తాన్ పార్లమెంట్ సప్లిమెంటరీ ఎజెండాను ప్రొసీడింగ్స్‌లో భాగంగా చేయాలని స్పీకర్‌ను కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ఓటింగ్ లో ఓడిపోతే , కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కూడా ఆరు అంశాల ఎజెండాలో ఉంది. దీనిపై వ్యూహం ఖరారు చేసేందుకు ఏకంగా ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానానికి కొన్ని గంటల ముందు తన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని ప్రశంసించిన తరువాత, పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమార్తె మరియం నవాజ్ పాకిస్తాన్‌ను విడిచిపెట్టి భారతదేశానికి వెళ్లమని చెప్పారు.

ఇవాళ బలపరీక్షకు ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయొచ్చని కూడా తెలుస్తోంది. అయితే ఓటింగ్ లో ఓడిపోతే పరువుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో విపక్షాలు కూడా ఏం జరిగినా తమకు అధికారం ఖాయమనే ధీమాలో కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది.

English summary
security arrangements beefed up outside and inside pakistan parliament ahead of voting on no confidence motion against imran khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X