"టాయిలెట్ పేపర్ లా వాడేసి విసిరేశారు"- అమెరికాపై రగిలిపోతున్న పాకిస్తాన్..!

భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని వాడుకుంటూ అమెరికా చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్నది పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా గతేడాది భారత్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిగా ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ చేయించినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. ఈ వాదనతో భారత్ ఏకీభవించకపోవడం, తాము అడగ్గానే కాల్పుల విరమణకు సహకరించడంతో ట్రంప్ కు పాక్ దగ్గరైంది. ఆ తర్వాత భారత్ పై భారీ సుంకాలు విధించి, పాకిస్తాన్ పాలకులతో ట్రంప్ విందులు చేసుకున్నారు.

దీంతో పాకిస్తాన్ కూడా ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందాలని, తద్వారా భారత్ తో ట్రంప్ బంధానికి బీటలు వారతాయని లెక్కలేసుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. భారత్ వంటి భారీ మార్కెట్ ను వదులుకుని, నానాటికీ ఆర్ధికంగా బీటలు వారుతున్న పాకిస్తాన్ కు అండగా నిలిచేందుకు ట్రంప్ నో చెప్పేశారు. దీని ఫలితమే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ఇచ్చిన షాక్ నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది.

Khawaja Asif s Remark on US Policy Pakistan Treated Like Toilet Paper

దీంతో అమెరికా తమను వాడుకుని టాయిలెట్ పేపర్ లా విసిరేశారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (khawaja asif) ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమెరికాతో తమకు ఉన్న బంధాన్ని ఆయన అంగీకరించారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తమ దేశాన్ని దోపిడీ చేసిందని, వాళ్ల లక్ష్యాలు నెరవేరాక టాయిలెట్ పేపర్ ముక్కలాగా విసిరేసిందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమ దేశం తరచూ తమకున్న ఉగ్రవాద చరిత్రను తిరస్కరిస్తుందని, కానీ ఇది గతంలో నియంతలు చేసిన తప్పు అని అంగీకరించారు.

Khawaja Asif s Remark on US Policy Pakistan Treated Like Toilet Paper

అలాగే రెండు ఆఫ్ఘన్ యుద్ధాలలో పాకిస్తాన్ భాగస్వామి కావడాన్ని కూడా మరో తప్పుగా అభివర్ణించారు. ఇవాళ పాకిస్తాన్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు తమ గత తప్పులకు ప్రతిఫలమని అంగీకరించారు. 1999 తర్వాత ఆప్ఘనిస్తాన్ విషయంలో అమెరికా-పాకిస్తాన్ కలిసి పనిచేయడం తమ దేశానికి శాశ్వత నష్టాన్ని మిగిల్చిందని ఖవాజా పేర్కొన్నారు. 2001సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో తిరిగి పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగిన నష్టాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్‌ను టాయిలెట్ పేపర్ ముక్క కంటే దారుణంగా చూశారని, దానిని తమ ప్రయోజనాల కోసం వాడుకుని విసిరేశారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+