భారత్ సీక్రెట్ బయటపెట్టిన పాకిస్తాన్ ! ఆపరేషన్ సింధూర్ లో హైదరాబాద్, గుజరాత్ ?
కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ను తొలుత పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలతో ప్రారంభించిన భారత్.. అనంతరం దాన్ని లాహోర్ లోని క్షిపణి రక్షణ వ్యవస్థలను కూల్చేవరకూ వెళ్లింది. అలాగే మరికొన్ని ఎయిర్ బేస్ లపైనా దాడులు చేసినట్లు భారత ఆర్మీ బయటపెట్టింది. కానీ ఇంతకు మించి భారత్ చాలా దాడులు చేసినట్లు తాజాగా పాకిస్తాన్ బయటపెట్టింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూస్ చేపట్టింది. ఇది పూర్తి కాకముందే ఇరు దేశాలూ కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే పాకిస్తాన్ భారత్ కు కౌంటర్ గా తాము చేపట్టిన ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూస్ లో ఏం జరిగిందో వెల్లడించే పత్రాల్ని తాజాగా బయటపెట్టింది. ఇందులో భారత్ తమను ఏ స్ధాయిలో దెబ్బతీసిందో గణాంకాలతో సహా బయటపెట్టింది. ఈ వివరాలతో పోలిస్తే ఆపరేషన్ సిందూర్ పై భారత్ బయటపెట్టిన వివరాలు తక్కువే.

భారత్ చెప్పిన దాని కంటే ఎనిమిది ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ తమ పత్రాల్లో పేర్కొంది. ఇందులో పెషావర్, గుజ్రన్ వాలా, సింధ్ లోని హైదరాబాద్, పంజాబ్ లో గుజరాత్, భావల్ నగర్, అటోక్, ఛోర్ వంటి టార్గెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ భారత సైన్యం వెల్లడించిన ఆపరేషన్ సింధూర్ దాడుల వివరాల్లో ఇవి లేవు. దీన్ని బట్టి చూస్తే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ లోకి ఏ స్ధాయిలో దూసుకెళ్లిందో అర్థమవుతోంది. అలాగే కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఎందుకు విజ్ఞప్తి చేసిందో కూడా తెలుస్తోంది.

ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసిందన్న విషయాన్ని కేంద్రంతో పాటు ఆర్మీ కూడా బయటపెట్టాయి. అయితే ఈ స్దాయిలో దాడులు చేయడం వల్లే పాక్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ కోరిందన్న విషయాలు మన సత్తాను తెలియజేసేలా ఉన్నాయి. మరోవైపు భారత్ ఈ స్దాయిలో చేసిన దాడులకు ప్రతీకారంగా తాము ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూస్ చేపట్టినట్లు పాక్ ఈ పత్రాల్లో చెప్పుకుంటోంది.












Click it and Unblock the Notifications