ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్...
భారత దేశ ప్రతికార దాడులకు భయపడడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడికొ తలొగ్గిన పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేసినట్టు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి.పీఓకేలోని గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న 11 శిబిరాలను ఎత్తివేసినట్టు ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచదేశాల ఒత్తిడి.. ప్రతికార దాడులకు భయపడుతున్న పాక్
పూల్వామా దాడి తర్వాత భారత దేశం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలతోపాటు , కశ్మీర్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈనేపథ్యంలోనే పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరంపై సర్జికల్ స్ట్ర్రైక్ దాడి చేసింది. దీంతో వందలాదీ మంది ఉగ్రవాదులు నెలమట్టమయ్యారు.. ఈనేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ దేశ సపోర్ట్‌తో పాటు జైష్ ఏ మహ్మద్,లష్కర్ ఏ తోయిబా నిషేధిత తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయి. దీంతో వాటికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రపంచ దేశాలకు భారత్ అందించింది.

పీవోకేలో 11 ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత
ఈనేపథ్యంలోనే ప్రపంచ దేశాల నుండి పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.దీనికి తోడు మరోవైపు భారత దేశం నుండి మరిన్ని సర్జికల్స్ స్ట్ట్రైక్స్ జరుగుతాయనే భయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలను గత కొద్ది నెలలుగా మూసివేస్తున్నాయి.ఇలా ఆక్రమిత కశ్మీర్‌లోని జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తోయిబా నిషేధిత తీవ్రవాద సంస్థలు నిర్వహిస్తున్న సుమారు 11 శిక్షణ శిబిరాలను భారత ఇంటలీజేన్స్ వర్గాలు తెలిపాయి. కాగా పీవోకేలోని ముజఫరాబాద్,లొని అయిదు శిబిరాలను కోట్లీలోని మరో అయిదు శిబిరాలను మూసివేయగా బర్నాలా ప్రాంతంలో మరో ఉగ్రవాద శిబిరాన్ని మూసి వేశారు.

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌పై ఒత్తిడి..
ముఖ్యంగా పుల్వామా అనంతరం పరిణామాల నేపథ్యంలో భారత్ ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలను చేసింది. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు ఆధారలను సేకరించింది.మోడీ సైతం తన ప్రమాణ స్వీకారోత్సవానికి కనీసం ఆహ్వానం కూడ పంపించలేదు. మరోవైపు ఆదేశంతో ద్వైపాక్షిక సంబంధాలకు సైతం ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక పీవోకే వెంట కూడ భారత్ భారీగా దళాలను మోహరించింది. ఇక పాకిస్థాన్ సైతం సరిహద్దు వెంబడి ఉద్రిక్తలను తగ్గించాలని సైతం భారత్‌ను కోరింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications