Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్‌తో ఇమ్రాన్ మంతనాలు.. ఎన్ఎస్సీ మీట్.. తర్వాత మీడియా ముందుకు ఖాన్

పాకిస్థాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం ఖాయమే అనిపిస్తోంది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంపై విప్ జారీచేసిన.. తాము హాజరుకాబోమని సొంత పార్టీ ఎంపీలు తెగేసి చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ నేత‌లు కూడా విప‌క్షానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. పాక్ ప్ర‌ధాని ప‌ద‌వికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌డం లేదు. అయితే ఏదీ చివర వరకు వదిలేదీ లేదని ఇమ్రాన్ అంటున్నారు. అందుకే వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు

 ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్‌తో భేటీ

ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్‌తో భేటీ


ప్ర‌ధాని హోదాలో ఇమ్రాన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ జావేద్ బాజ్వా, ఆ దేశ గూఢ‌చార సంస్థ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ లెప్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఇస్లామాబాద్‌లోని ఇమ్రాన్ అధికారిక నివాసంలో భేటీ జరిగింది. ఏప్రిల్ 3వ తేదీన పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. అయితే అతనికి సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. దీంతో రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

విత్ డ్రా

విత్ డ్రా


మరోవైపు ఇమ్రాన్.. పార్టీ పీటీఐకి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని బలూచిస్తాన్ అవామీ పార్టీ తెలిపింది. ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ సమావేశం తర్వాత పాక్ ప్రధాని ఇమమ్రాన్ ఖాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఉంది.

 తప్పని ఓటమి..?

తప్పని ఓటమి..?


పాకిస్థాన్ దిగువ స‌భ్య‌లో 342 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఇమ్రాన్ కూట‌మిలో 178 మంది, ప్ర‌తిప‌క్షాల కూట‌మిలో 163 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఆయన పదవీకి గండం ఏర్పడింది. గ‌తంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్ర‌ధానుల‌పై అవిశ్వాస తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెన‌ర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌గా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్ర‌ధాని షౌకాత్‌ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+