కాశ్మీర్ సహా.. దేనికైనా రెడీ: పాక్ ప్రధాని సంచలనం

Pakistan PM Shahbaz Sharif: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాదుల నరమేధానికి భారత్.. ప్రతీకారం తీర్చుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాలను బట్టబయలు చేస్తోన్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఉగ్రవాదం సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా, శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంవత్సరాల తరబడి కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సుముఖతను తెలియజేసింది.

Pakistan PM Shehbaz Sharif willing to hold peace talks with India

ఈ విషయాన్ని స్వయానా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటనను ముగించుకుని ఇరాన్ లో అడుగుపెట్టారు. ఆయన వెంట ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, దేశీయ వ్యవహారాల మంత్రి మొహసిన్ రజా నఖ్వీ, సమాచార మంత్రి అతావుల్లా తరార్ ఉన్నారు.

రాజధాని టెహ్రాన్ లో ఆ దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. స్వాగతం పలికారు. అనంతరం సాదాబాద్ ప్యాలెస్‌లో పెజెష్కియాన్‌తో చర్చల్లో పాల్గొన్నారు షరీఫ్. అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న జమ్మూ కాశ్మీర్ సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లు, వాణిజ్యం, ఇండస్ వాటర్ ట్రీటీ.. వంటి ఇతరత్రా అంశాలపై భారత్ తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తోన్నామని, చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. సైనిక చర్య, యుద్ధాన్ని కోరుకుంటే- తమ ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని తేల్చి చెప్పారు.

తమ దేశంపై భారత్ దురాక్రమణకు పాల్పడాలను చూస్తే తమ భూ భాగాన్ని రక్షించుకోవడానికి తాము కూడా అదే మార్గంలో వెళ్తామని, ధీటుగా సమాధానం ఇస్తామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ విషయంలో ఆయన ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య సాగిన దాడులు- ప్రతిదాడులను పరోక్షంగా ఉదహరించారు.

భారత్ నిజంగా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటోన్నట్లయితే శాంతి చర్చల ప్రతిపాదనలకు అంగీకరించాలని షరీఫ్ వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, భారత్ వైఖరి ఏమిటనేది ఆ దేశ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు పెజెష్కియన్ ఆందోళన వ్యక్తం చేయడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించడం పట్ల షరీఫ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చినీ ప్రశంసించారు. ఆయనను అత్యుత్తమ దౌత్యవేత్తగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+