వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ సస్పెన్స్ థ్రిల్లర్- ఇమ్రాన్ తప్పుకుంటే ఏం జరగబోతోంది ? ముందస్తు ఎన్నికలు ఖాయం ?

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ లో రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, పాక్ సుప్రింకోర్టు దాన్ని తోసిపుచ్చడం, ఇవాళ ఓటింగ్ చకచకా జరిగిపోతున్నాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతే రాజీనామా చేయడం ఖాయం. అయితే ఆ తర్వాత ఏం జరగబోతోందనే అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. దీని వెనుక అసలు కారణాలివే...

 ఇమ్రాన్ భవితవ్యం తేలేది నేడే ?

ఇమ్రాన్ భవితవ్యం తేలేది నేడే ?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు తేల్చేందుకు జాతీయ అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. ఇందులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో సహజంగానే విపక్షాల కంటే మెజారిటీ తక్కువగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడం ఖాయం. దీంతో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసి ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు సైతం ఆసక్తి రేపుతున్నాయి.

 కొత్త ప్రధాని ఎంపిక

కొత్త ప్రధాని ఎంపిక

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోతే ఆయన స్ధానంలో కొత్త ప్రధానిగా మరొకరిని జాతీయ అసెంబ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సహజంగానే మెజార్టీ కలిగిన విపక్షాలు.. తమ ప్రధాని అభ్యర్ధిగా ఎవరో ఒకరిని ప్రతిపాదించి నెగ్గించుకోవడం జరుగుతుంది. అప్పుడు కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పదవికి విపక్ష పీఎంఎల్-ఎన్ నేత షాబాజ్ షరీఫ్ రేసులో ముందున్నారు. ఆయన పాక్ తదుపరి ప్రధాని కావడం ఖాయమని తెలుస్తోంది.

 అయినా ముందస్తు ఎన్నికలు తప్పవా ?

అయినా ముందస్తు ఎన్నికలు తప్పవా ?

వాస్తవానికి పాకిస్తాన్ పార్లమెంట్ గడువు వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఉంది. దీన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా రద్దు చేసి మూడు నెలల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వాటిపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్రధాని ఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రధాని ఇమ్రాన్ గద్దెదిగితే ఆయనపై నైతికంగా కూడా విజయం సాధించే విపక్షాల ప్రధాని కూడా ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమకు ప్రజల్లో పెరిగిన మద్దతును అవకాశంగా మార్చుకోవాలనేది విపక్షాల ఎత్తుగడగా కనిపిస్తోంది. అదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయం. అలాగే విపక్షాలు నిలబెట్టిన ప్రధానమంత్రి కూడా బలపరీక్షలో విఫలమైనా ముందస్తు ఎన్నికలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

English summary
debate is going on in pakistan parliament no confidence motion against imran khan government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X