భారత్ తో యుద్ధ భయాలు-కీలక బాధ్యతల్లోకి పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్..!

కాశ్మీర్ లో పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైకి యుద్ధానికి సై అంటూ బీరాలు పలుకుతున్నా... ఓసారి పోరు మొదలైతే దాన్ని ఎలా తట్టుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ గా వ్యవహరిస్తున్న మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో ఐఎస్ఐ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆసిమ్ మాలిక్ కు సైన్యంలో ఉన్న విస్తృత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా సలహాదారుగా నియమిస్తూ షెహబాజ్ షరీఫ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Pakistan promoted ISI chief as NSA amid fears of war with india

ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేయడానికి ముందు ఆసిమ్ మాలిక్.. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయంలో అడ్జుటెంట్ జనరల్‌గా పనిచేశారు. అలాగే చట్టపరమైన , క్రమశిక్షణా విషయాలతో సహా సైనిక పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. అడ్జుటెంట్ జనరల్‌గా ఆయన పదవీకాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలలో మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు సహా పలు కీలక ఘటనలు ఉన్నాయి. వీటిని సమర్ధంగా ఎదుర్కొన్న అనుభవం ఉండటంతో ఆయన్ను భద్రతా సలహాదారుగా నియమించినట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ లో భద్రతా పరంగా సవాళ్లతో కూడిన బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ ప్రావిన్స్ లలో పనిచేసిన అనుభవం ఆసిమ్ మాలిక్ కు ఉంది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకపోయినా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నిత్యం కాల్పులు జరుపుతూనే ఉంది. అలాగే వచ్చే 24-36 గంటల్లో భారత్ తమపై సైనిక దాడి చేయొచ్చని తమకు పక్కా నిఘా సమాచారం ఉందంటూ పాకిస్తాన్ మంత్రి అతావుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మాలిక్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+