విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు
ఇస్లామాబాద్: చనిపోయిన వ్యక్తి అకౌంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన విచారణ సంస్థ ఫెడరల్ దర్యాఫ్తు రూ.460 కోట్లను గుర్తించింది. అతను నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. అతని పేరు మీద మూడు బ్యాంక్ అకౌంట్లు, అందులో డబ్బు ఉంది.
కరాచీకి చెందిన ఇక్బాల్ అరయాన్ అనే వ్యక్తి 2014లో చనిపోయాడు. అతను మృతి చెందినా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.460 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణ సంస్థ గుర్తించింది. కొందరు బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు కేసులు రావడంతో సుప్రీం కోర్టు జాయింట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(జేఐటీ)ని నియమించింది.

ఇందులో భాగంగా ఈ ఖాతాలు, అందులోని డబ్బు తేలింది. ఇది చూసి విచారణ అధికారులు విస్తుపోయారు. పేద ప్రజల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి కొందరు బ్యాంకు అధికారులు భారీ మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు.
ఇటీవల కరాచీలోని ఓ చిరు వ్యాపారి బ్యాంకు ఖాతాలో ఆయనకు తెలియకుండా రూ.200 కోట్ల వచ్చి పడ్డాయి. ఓ ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. అధికారుల విచారణలో వారి డబ్బులు కాదని తేలింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications