పాకిస్థాన్ లో వరుస భూకంపాలు.. ఇళ్లు ధ్వంసం.. జనాలు పరుగులు
పాకిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూ ప్రకంపనలు 4.7 తీవ్రతతో నమోదయ్యాయి. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ విభాగం పేర్కొంది. శనివారం, ఆదివారం కూడా పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0 గా నమోదైంది. అయితే సోమవారం నమోదైన భూకంపం ప్రమాదకరమైనదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్టు చేసింది.
పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రపంచ దేశాలతోపాటు ప్రకృతి కూడా ఈ దేశానికి సహకరించడం లేదు. ఇటీవల అకాల వర్షాలు, వరదలతో దాయాది దేశం అతలాకుతలం అయింది. రావి నది ఉప్పొంగి సంభవించిన వరదలకు పాకిస్థాన్ లోని పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లింది. అంతకుముందు భారత్ లోని పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి పాకిస్థాన్ కు బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ కు వాణిజ్యం నిలిపివేసింది. సింధూ జలాల పంపిణీ నిలిపివేసింది భారత్. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్న పాకిస్థాన్ కు ఇప్పుడు భూకంపాలు తోడయ్యాయి.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లో వరుస భూకంపాలు అధికం అయ్యాయి. వరుసగా శనివారం, ఆదివారం, సోమవారం భూకంపాలు నమోదు కావడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా మరోసారి పాకిస్థాన్ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ విభాగం పేర్కొంది. భూకంపం ధాటికి పలు చోట్లు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరుస భూకంపాల కారణంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications