'డ్యామ్ గేట్లు ఎత్తి ప్రజల్ని చంపాలని చూస్తారా..?' భారత్ కు పాకిస్థాన్ వార్నింగ్

పాకిస్థాన్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని నదులు ఉప్పొంగుతున్నాయి. అధిక వర్షాల కారణంగా, ప్రధాన ఆనకట్టల గేట్లు తెరిచి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో తావి నదిలో వరదలు రావచ్చని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ కు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మానవతా దృష్టితో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ విషయంలోనూ రాజకీయాలు చేస్తోంది. భారత్ పై విషం కక్కుతోంది. భారత్ నీటిని ఓ ఆయుధంగా మార్చకుంటోందని పాకిస్థాన్ ను ముంచేయాలని ప్లాన్ చేస్తోందని మండిపడుతోంది.

భారత్.. మానవతా దృక్పథంతో పాకిస్థాన్ కు మంచి చేసినా.. ఆ దేశం మాత్రం తన ఉగ్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాకిస్థాన్ ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు వరదలు రావొచ్చని జాగ్రత్తగా ఉండాలని భారత్ ముందే హెచ్చరికలు జారీ చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం తమ ప్రజల్ని ముంచేసేందుకే భారత్ డ్యామ్ గేట్లు తెరిచిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు భారత్ పై పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ మినిస్టర్ అహసన్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"భారత్ కావాలనే పాకిస్థాన్ పై కుట్ర పన్నింది. నీటిని ఆయుధంగా మార్చుకుంది. కావాలనే ఒక్కసారిగా డ్యామ్స్ గేట్లను ఓపెన్ చేసింది. దీంతో భారత సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో వరదలు వచ్చాయి. భారత్ దుశ్చర్యతో రావి, సట్లెజ్, చీనాబ్ నదుల పరిసర ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాలు నీట మునిగాయి. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్ కు ముందుగానే సూచనలు చేయాలి. కానీ భారత్ కావాలనే చివరి వరకూ వేచి చూసింది. ఇది నదీ జల ఒప్పందానికి విరుద్ధం" అని పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ మినిస్టర్ అహసన్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan Slams India for Turning Water into a Weapon Alleges Deliberate Flooding

పాకిస్థాన్ లో వరదల కారణంగా 800 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఆర్మీ అధికారులు లక్షా 50 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా 200 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం దెబ్బతిన్నది. అకాల వరదలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక సమావేశం నిర్వహించారు. వరద నీరు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్టోరేజీ వ్యవస్థను వేగవంతం చేయాలని ఆదేశించారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+