ప్రమాదం: పాక్ నటి సనాఖాన్ మృతి, భర్తకు గాయాలు

పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం.. సనాఖాన్, ఆమె భర్త బాబర్ ఖాన్ కారులో కరాచి నుంచి హైదరాబాద్ వెళుతుండగా కారు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని సమీపంలోని లియాఖత్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఆస్పత్రికి తరలించేలోపే సనాఖాన్ మృతి చెందారు. బాబర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి సనాఖాన్, ఆమె భర్త బాబర్ ఖాన్ పలు టీవి కార్యక్రమాల్లోనూ కలిసి నటించారు. వారిద్దరికి గత ఏడాది డిసెంబర్ నెలలో వివాహం జరిగింది.
నైజీరియాలో రోడ్డు ప్రమాదం: 34 మంది మృతి
ఉత్తర నైజర్ రాష్ట్రంలోని రిజూ-కొంటగోరా రోడ్డు మార్గంలో జరిగిన ప్రమాదంలో 34 మంది మృతి చెందినట్లు నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. ఒక ఆయిల్ ట్యాంకర్, పశువులతో వెళుతున్న మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన చెప్పారు.
ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. అతి వేగంగా వచ్చిన ఆ వాహనం ప్రజలనూ ఢీకొట్టడంతో 34 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications