అనుమానాస్పద స్థితిలో పాక్ లేడీ క్రికెటర్ మృతి

Pakistani teenage female cricketer dies under mysterious circumstances
కరాచీ: పాకిస్తాన్ టీనేజ్ మహిళా క్రికెటర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె ఇది వరకు ముల్తాన్ క్రికెట్ క్లబ్‌పై ఆరోపణలు చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

తన కూతురు మృతికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) బాధ్యత వహించాలని క్రికెటర్ హలీమా రఫీక్ మీడియాతో మంగళవారంనాడు అన్నారు. ఎంసిసిసి అధికారులపై తన కూతురు చెప్పిన విషయాలను బోర్డు వినిపించుకోలేదని, ఆమెపై ఓ నిందితుడు మౌల్వీ సుల్తాన్ ఆలం 20 మిలియన్ రూపాయలకు పరువు నష్టం దావా వేయడంతో ఆమె మనస్తాపానికి గురైందని ఆయన వివరించారు.

క్యాంప్ శిక్షణ సందర్భంగా మౌల్వీ సుల్తాన్, ఇతర అధికారులు కొంత మంది తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ హలీమాతో పాటు మరో నలుగురు అమ్మాయిలు ఆరోపించారు. అంతటి తీవ్రమైన ఆరోపణలపై పిసిబి మహిళా విభాగం హడావిడిగా విచారణను జరిపింది.

తన గదిలో హలీమా మరణించింది. ముల్తాన్ ప్రాంతంలో ప్రతిభావంతురాలైన క్రికెటర్‌గా ఆమెకు పేరుంది. తన ఉపవాసం సందర్భంగా 17 ఏళ్ల ఆ క్రికెట్ యాసిడ్ సేవించినట్లు చెబుతున్నారు. దాంతో ఆమె మరణించింది.

విచారణ కమిటీ ముందు హలీమా హాజరు కాలేదని, ఇతర అమ్మాయిలు మాత్రం హాజరయ్యారని తెలుస్తోంది. అయితే, తమపై లైంగిక వేధింపులు జరగలేదని చెప్పారు. దాంతో ఆ క్రికెటర్లందరినీ ఆరు నెలల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి వెలి వేయాలని విచారణ కమిటీ సిఫార్సు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+