ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం: ట్రంప్ ప్రకటనపై నిరసనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంపై పాలస్తీనా భగ్గుమంది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించిన విషయం తెలిసిందే. గాజాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఈ నిర్ణయంపై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. దీనిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దీనిపై గల్ఫ్ కింగ్ డమ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది.

ట్రంప్ ప్రకటన అర్థరహితంగా ఉందని పేర్కొంది. బాధ్యతారహితంగా ఉందని మండిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ మాత్రం ఆ ప్రకటనను చారిత్రాత్మకమని చెప్పారు.












Click it and Unblock the Notifications