మటన్ బోన్ సూప్.. హెల్దీగా, యంగ్ గా కనిపించాలంటే ఇలా చెయ్యండి!
మటన్ బోన్ సూప్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. ముఖ్యంగా శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా శరీరంలో ఎక్కడైనా బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు అవి త్వరగా నయం కావడానికి మటన్ బోన్ సూప్ ఎంతో మంచిది. ఈ సూప్ తాగితే శరీరానికి బలం వస్తుంది.
మటన్ బోన్ సూప్
మటన్ బోన్ సూప్ తో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మటన్ ఎముకల్లో ఉండే క్యాల్షియం, ప్రోటీన్, కొల్లాజెన్ వంటి పోషకాలతో మన శరీరానికి మంచి శక్తి మాత్రమే కాదు, యంగ్ లుక్ కూడా వస్తుంది. అటువంటి మటన్ బోన్స్ సూప్ ఈ విధానంలో తయారుచేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
మటన్ ఎముకలు - 500 గ్రాములు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - హాఫ్ టీ స్పూన్
గరం మసాలా- హాఫ్ టీ స్పూన్
కారం - ఒక స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
ధనియాల పొడి- ఒక స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీరు -6 నుండి 7 కప్పులు
తయారీ విధానం
ముందుగా మటన్ ఎముకలను శుభ్రంగా కడగాలి. ఒక కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలను వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత మటన్ ఎముకలు వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి సూప్ కు సరిపడా నీరు పోయాలి.
కుక్కర్ లో ఇలా ఉడికిస్తేనే బోన్ సూప్ టేస్ట్
కుక్కర్ మూత పెట్టి సుమారు 8 నుండి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి, కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన మటన్ బోన్ సూప్ రెడీ అవుతుంది.
మటన్ బోన్ సూప్ ప్రయోజనాలు
మటన్ బోన్ సూప్ శరీరానికి బలం ఇస్తుంది. జలుబు, గొంతు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలాన్ని పెంచుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications