వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరాగ్ అగర్వాల్ ఔట్..? గద్దె కూడా.. ట్విట్టర్ సీఈవోగా మస్క్.. తర్వాత ఎవరంటే..

|
Google Oneindia TeluguNews

ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అయితే ఆ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుంది. అయినప్పటికీ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దె పోస్టులు బూస్టింగ్ కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఈవో పదవీ నుంచి పరాగ్ అగర్వాల్ వైదొలగనున్నట్టు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ సీఈవోకి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

టెస్లా సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలు చూసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సీఈవో పరాగ్ అగర్వాల్ ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరాగ్‌ను మస్క్ తొలగించనున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. కొత్త సీఈవోను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆ కొత్త సీఈవో వచ్చే వరకు కొన్ని రోజుల పాటు ట్విట్టర్ కు తాత్కాలిక సీఈవోగా మస్క్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వుంది.

Parag Agarwal will be discharged from Twitter

పరాగ్ ను తొలగిస్తే ఆయనకు 4.3 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలి. ఇటు కంపెనీకి లీగల్ హెడ్ విజయ గద్దెను తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఆమెకు 1.25 కోట్ల డాలర్ల మేర పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాక తమ భవిష్యత్ పై ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తన సంస్థలో ఉద్యోగ భద్రత లేదనుకునేవాళ్లు వెళ్లిపోయినా తనకేమీ అభ్యంతరం లేదని మస్క్ అంటున్నారు. త్వరలో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది.

కంపెనీలో ఎక్కువ జీతాలు ఉన్నవారిని కూడా తొలగించాలని మాస్క్ అనుకుంటున్నారు. లీగల్ హెడ్ విజయ గద్దెన కూడా తప్పించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు న్యూ యార్క్ పోస్ట్ తెలిపింది. గద్దెకు 12.5 మిలియన్ డాలర్ల ప్యాకేజీ.. ట్వీట్టర్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 17 మిలియన్ డాలర్లు ఏడాదికి సంపాదిస్తోంది. కంపెనీలో హైయస్ట్ పెయిడ్ ఉద్యోగి కావడంతో.. ఆమెకు మంగళం పాడాలని అనుకుంటున్నారు. గద్దె కూడా బాధపడ్డారు. ట్విట్టర్ భవిష్యత్ ఏంటీ అని ఉద్యోగుల వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్యోగులు కూడా భయపడుతున్నారు. తమ జాబ్స్ సెక్యూరిటీ ఏదీ అని అడుగుతున్నారు. సీఈవో, లీగల్ హెడ్ పోస్టులు పోయాక.. తమలాంటి వారివి ఏంటీ అని అడుగుతున్నారు

English summary
Elon Musk has line-up a new chief executive, who will replace the current Twitter CEO Parag Agarwal after the deal is fixed. But now it is being said that Elon Musk can be the CEO of Twitter temporarily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X