plane crash: కుప్పకూలిన విమానం, 14 మంది మృతి
బ్రెజిలియా: బ్రిజల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర అమెరికాలోని బార్సిలోస్ ప్రావిన్స్‌లో విమానం కూలిపోవడంతో 14 మంది మృతి చెందారు. ఈ మేరకు వివరాలను ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాద స్థలికి సహాయక బృందాలు చేరుకున్నాయని, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. మృతి చెందినవారిలో అమెరికా పౌరులు ఉన్నారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర రాజధాని నుంచి విమానం బయలుదేరింది. మనౌస్, బార్సెలోస్‌కి దాదాపు 90 నిమిషాల ప్రయాణం ముగించుకుని.. ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో విమానం ప్రమాదానికి గురైందని సీఎన్ఎన్ బ్రెజిల్ వెల్లడించింది. సమీపంలోని అమెజాన్ అటవీ ప్రాంతంలో విమానం కుప్పకూలిందని తెలిపింది.
BREAKING 🚨⚡ Brazil🇧🇷
— Izlamic Terrorist (@raviagrawal3) September 17, 2023
About 14 people have died in a plane crash in Brazil, while many others are injured. pic.twitter.com/KdmBYI96Cc
ఈ ప్రమాదంలో విమానంలోని ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విమాన ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం కురవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఘటనపై ఆదేశించినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఏరోనాటికల్ యాక్సిడెంట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications