ఒకే వేదికపై ప్రధాని మోదీ- చైనా అధినేత జిన్‌పింగ్
జొహాన్నెస్‌బర్గ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలతో మోదీకి స్వాగతం పలికారు.
బ్రిక్స్ సమావేశానికి జొహాన్నెస్‌బర్గ్‌లోని సమ్మర్ ప్లేస్.. వేదిక అయింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.

సమ్మర్ ప్లేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సిరిల్ రమాఫోసా సాదర స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సూచికగా వారందరూ గ్రూప్ ఫొటో దిగారు. ఒకే వేదికపై ప్రధాని మోదీ, గ్ఝి జిన్‌పింగ్ కనిపించారు. ఇద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గ్రూప్ ఫొటో దిగారు.
బ్రిక్స్ ప్రధాన సమావేశం ప్రారంభానికి ముందు ఆయన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతలతో సమావేశం అయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా ఆవిర్భవింపజేయడానికి కృషి చేస్తోన్నామని. త్వరలోనే అయిదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.

యావత్ ప్రపంచానికే గ్రోత్ ఇంజిన్‌గా నిలుస్తామని, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా.. వంటి నినాదాలతో ముందుకు వెళ్తోన్నామని మోదీ పునరుద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టడానికి అనువైన దేశంగా మార్చడంలో సఫలీకృతులం కాగలిగామని మోదీ చెప్పారు. సంక్షేమ పథకాల డెలివరీ మెకానిజం, సుపరిపాలనపై దృష్టి సారించామని, అవి సత్ఫలితాలను ఇస్తోన్నాయని పేర్కొన్నారు.
నగరాల నుంచి గ్రామస్థాయి వరకు యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నమోదు కావడానికి సుపరిపాలనే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. వీధి వ్యాపారులు మొదలుకుని షాపింగ్ మాల్స్‌కు వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తోన్నారని మోదీ ఉదహరించారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications