• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునాక్ ఏం చెప్పారో గానీ ఆసక్తిగా విన్న ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

జకర్తా: ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్‌‌కు హాజరయ్యారు. ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాలను ఆయన ప్రస్తావించారు. దీనికంతటికీ అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రెడ్ కార్పెట్..

రెడ్ కార్పెట్..

అంతకుముందు- ప్రధాని మోదీ బాలిలోని అపూర్వ కెంపిన్‌స్కి హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఘన స్వాగతం పలికారు. జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ సెషన్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్నారు. వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేశారు. మోదీ ఫుడ్ అండ్ ఎనర్జీ సెషన్‌లో పాల్గొన్న కొద్దిసేపటికే బైడెన్ ఆయనను కలుసుకోవడానికి వచ్చారు.

మోదీతో బైడెన్..

మోదీతో బైడెన్..

బైడెన్ తనవైపు వస్తోండటాన్ని గమనించిన మోదీ తన కుర్చీ నుంచి లేచి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేశారు. ఆ సమయంలో అక్కడే నిల్చుని ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను బైడెన్‌కు పరిచయం చేశారు మోదీ. కొద్దిసేపు అక్కడే నిల్చుని మాట్లాడారు. ఆ తరువాత మోదీ పక్క కుర్చీలోనే ఆసీనులయ్యారు బైడెన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో ప్రధాని మోదీ కొద్దిసేపు సంభాషించారు.

రిషి సునాక్‌తో..

రిషి సునాక్‌తో..

ఈ సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలిశారు. జీ20 సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చిన బాలి నుసు దువా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో మోదీని మర్యాదపూరకంగా కలిశారు రిషి సునాక్. ఈ సందర్భంగా రిషి పలు అంశాలను ప్రస్తావించగా.. వాటిని మోదీ శ్రద్ధగా, ఆసక్తిగా వినడం కనిపించింది. ఒకట్రెండు సందర్భాల్లో ఆయన రిషి సునక్ భుజం తట్టి, ప్రశంసించారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్‌ స్థానంలో ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన రిషి సునాక్‌ను మోదీ కలుసుకోవడం ఇదే తొలిసారి.

కీలక అంశాలపై..

కీలక అంశాలపై..

జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం బాలి చేరుకున్నారు. ప్రపంచ వృద్ధి రేటును మళ్లీ గాడిన పెట్టడం, ఆహారం- ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటలీకరణతో సహా పలు అంశాలపై జీ20 సమ్మిట్‌లో మోదీ విస్తృతంగా చర్చలు జరుపుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తారు. అనంతరం ఇండోనేషియాలో స్థిరపడిన భారతీయులను ఆయన కలుసుకుంటారు.

English summary
PM Modi and his UK's counterpart Rishi Sunak in conversation during the G20 Summit in Bali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X