బ్లూంబర్గ్ ప్రభావశీలుర జాబితాలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బ్లూంబర్గ్ మార్కెట్స్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే 13వ స్థానంలో నిలిచారు. లిస్టులో అమెరికా చైర్ పర్సన్ జానెత్ యెలెన్ తొలి స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత రెండో స్థానంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్, మూడో స్థానంలో టిమ్ కుక్ ఉన్నారు. తాజా జాబితాలో సగానికి పైగా మంది కొత్తగా చేరిన వారేనని బ్లూంబర్గ్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ ఏడాది ఆసియాకు చెందిన వారు ఎక్కువగా చోటు దక్కించుకున్నారని తెలిపింది.

ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో దాదాపు సగం మంది గతంలో ఎప్పుడూ లిస్టులో లేరని బ్లూంబర్గ్ చెప్పింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి బ్లూంబర్గ్ చెబుతూ... మోడీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 30 ఏళ్ల తర్వాత అత్యధిక మెజార్టీ సీట్లతో బిజెపిని గెలిపించారని ప్రస్తావించింది.

PM Modi has been listed on Bloomberg Markets Most Influential’ list

బ్లూంబర్గ్ ప్రభావశీలుర జాబితా

1. జానెత్ యెలెన్ - చైర్ పర్సన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్
2.జీ జింగ్‌పింగ్ - చైనా అధ్యక్షుడు
3.టిమ్ కుక్ - యాపిల్ సీఈవో
4.లారీ ఫింక్ - బ్లాక్ రాక్ సహ వ్యవస్థాపకులు
5. వారెన్ బఫెట్ - బెర్క్ షైర్ హాత్ వే సీఈవో
6. బరాక్ ఒబామా - అమెరికా అధ్యక్షులు
7.కార్ల్ - ఇకాన్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్
8. లాయిడ్ బ్లాంక్‌ఫీన్ - గోల్డ్‌మాన్ సాచ్స్ సీఈవో
9. ఏజెలా మోర్కెల్ - జెర్మన్ ఛాన్సలర్
10.రీడ్ హోఫ్‌మెన్ - లింకెడిన్ సహ వ్యవస్థాపకులు
కాగా, పదమూడవ స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+