• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమలా హ్యారిస్ కు తాత జ్ఞాపకంతో పాటు మీనకారీ కళాకృతులతో మోడీ బహుమతులు; వారికి కూడా అద్భుతమైన గిఫ్ట్స్ !!

|

ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ పర్యటన కొనసాగుతోంది. మోడీ తన అమెరికా పర్యటనలో, యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు . అంతేకాదు ఆమెకు భారతదేశం నుండి ప్రత్యేకమైన బహుమతులు అందజేశారు. ఏ దేశానికి వెళ్లినా ప్రధాని నరేంద్రమోడీ ఆయనను కలుసుకున్న అధినేతలు, ప్రముఖులకు ఆకట్టుకునేలా బహుమతులు ఇస్తుంటారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ఆయన పర్యటన ఉద్దేశాన్ని తెలియజేసేలా తదనుగుణంగా బహుమతులు అందిస్తుంటారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

కమలా హ్యారిస్ కు కాశీ విశిష్టత తెలిసేలా.. మీనకారి కళాత్మక బహుమతులు
ప్రధాని మోదీ కమలా హారిస్‌కి తన తాత పివి గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్‌ల కాపీని చెక్క హస్తకళ ఫ్రేమ్‌లో అందజేశారు. పివి గోపాలన్ భారతదేశంలో వివిధ హోదాల్లో పనిచేసిన గౌరవనీయ ప్రభుత్వ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ ల కాపీని ఆయన కాశీ మీనకారి హస్తకళ తెలిసేలా చక్కని ఫ్రేమ్ లో ఇచ్చారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ కమలా హారిస్‌కు గులాబీ మీనకారి చెస్ సెట్‌ను బహుమతిగా ఇచ్చారు. గులాబీ మీనకారి కళ ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటైన కాశితో దగ్గరి సంబంధం కలిగి ఉన్న కళ. ఇది ప్రధాని మోడీ నియోజకవర్గం కూడా కావడంతో ఆయన కాశీ విశిష్టతను ప్రతిబింబించేలా చెస్ సెట్ ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు.

PM Modi presents US vice president Kamala Harris, other world leaders with unique gifts from Kashi

గులాబీ మీనకారీ చదరంగం సెట్ బహుమతిగా ఇచ్చిన మోడీ
ఈ ప్రత్యేక చదరంగం సెట్‌లోని ప్రతి భాగం అద్భుతంగా హస్తకళతో రూపొందించబడింది. అయితే ప్రకాశవంతమైన రంగులు కాశీ యొక్క ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రధాని మోడీ మరియు కమలా హారిస్ వైట్ హౌస్‌లో చర్చలు జరిపారు మరియు తరువాత ఇండో-యుఎస్ సంబంధాలను బలోపేతం చేయడం, కోవిడ్ -19 మరియు ఇతర ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కమలా హారిస్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి స్ఫూర్తిదాయక నేత గా అభివర్ణించారు మరియు అధ్యక్షుడు జో బిడెన్ మరియు ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను తాకుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా పీఎంకు గులాబీ మీనకారి నౌక, జపాన్ పీఎంకు బుద్ధుడి విగ్రహం
తరువాత, పిఎం మోడీ ఇతర క్వాడ్ నాయకులతో సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియన్ పీఎం స్కాట్ మోరిసన్‌కు ఒక వెండి గులాబీ మీనకారి నౌకను బహుమతిగా ఇచ్చారు. ఇది కూడా విలక్షణంగా హస్తకళతో తయారు చేయబడింది మరియు కాశీ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. జపాన్ ప్రధాన మంత్రి యోషిహిడే సుగాకు గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. భారతదేశాన్ని మరియు జపాన్‌ను ఒకచోట చేర్చడంలో బౌద్ధమతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బుద్ధుని ఆలోచనలు జపాన్లో ప్రతిధ్వనిస్తాయి. గతంలో జపాన్‌లో పర్యటించినప్పుడు, మోదీ బౌద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు.

క్వాడ్ దేశాల సదస్సుకు మోడీ .. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంబంధాల బలోపేతంపై దృష్టి
ఈనెల 24వ తేదీన క్వాడ్ దేశాల సదస్సుకు హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ లతో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, కరోనా ను ఎదుర్కోవడానికి ప్రాక్టికల్ కోఆపరేషన్ ను మరింత అడ్వాన్స్ గా మార్చడం, వాతావరణ సంక్షోభం, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ స్పేస్ కు సంబంధించిన అనేక విషయాలు, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా మార్చడం, వంటి 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే అంశాలపై క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో చర్చలు జరుపుతున్నారు.

English summary
PM Modi presents US vice president Kamala Harris, other world leaders with unique gifts from Kashi. Modi handed over a copy of old notifications of his grandfather PV Gopalan to US Vice President Kamala Harris
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X