వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమైన మిత్రుడికి స్వాగతం: మోడీకి ట్రంప్ ట్వీట్

రెండురోజుల పర్యటనకు వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఘనంగా స్వాగతం పలికారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రెండురోజుల పర్యటనకు వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఘనంగా స్వాగతం పలికారు. మోడీ రాకకోసం శ్వేతసౌదం ఎంతగానో ఎదురుచూస్తోందంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహత్మకమైన విషయాల గురించి చర్చలను జరుపుతామని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కు మోడీ కూడ స్పందించారు. ఎంతో ఆప్యాయంగా వ్యక్తిగతంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు మోడీ.

 PM Modi replies to Donald Trump’s ‘True Friend’ tweet, thanks him for ‘warm personal welcome’

మీతో సమావేశమై చర్చలు జరిపేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ మోడీ కూడ ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్రంప్, మోడీలు మూడు దఫాలు ఫోన్ లో చర్చించారు. అయితే ట్రంప్ అద్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముఖాముఖి తొలిసారి కలుసుకోనున్నారు.

దీంతో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరుదేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడతాయని అక్కడి సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య సంబంధాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు. రక్షణశాఖకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చించనున్నారు.

హెచ్ 1 బీ వీసాల అంశంపై భారత్ అభ్యర్థిస్తే ఆ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం సానుకూల సంకేతాలను పంపింది.ఇప్పటికే మానవరహిత గార్డియన్ డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
సుమారు 2 నుండి 3 బిలియన్ డాలర్లతో కూడ ఈ ఒప్పందానికి అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో ట్రంప్ తో మోడీ సమావేశం కానున్నారు. మోడీ కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ట్రంప్ విదేశీ నేతలకు ఇచ్చే విందు మోడీతోనే ప్రారంభం కానుంది.

English summary
After reaching Washington DC on Sunday , Prime Minister Narendra Modi thanked US President Donald Trump for the “warm personal welcome”.“Thank you President of the United States (POTUS) for the warm personal welcome. Greatly look forward to my meeting and discussions with you, Donald Trump,” PM Modi tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X