వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ కు ఆయుధాలివ్వడం కరెక్టే-ఆత్మరక్షణ కోసమేగా-పోప్ సమర్ధన

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పాశ్చాత్యదేశాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ కు అండగా నిలిచిన పాశ్చాత్యదేశాలు ఆయుధాల్ని అందిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యాకు చుక్కలు చూపిస్తోంది. దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నా పాశ్చాత్యదేశాలు వెనక్కితగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వడంలో తప్పులేదన్నారు.

రష్యా దురాక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం నైతికంగా చట్టబద్ధమైనదని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. కజకిస్తాన్ లో మూడు రోజుల పర్యటన నుంచి తిరిగి వస్తున్న విమానంలో మీడియా ప్రతినిధితో పోప్ మాట్లాడారు. ఉక్రెయిన్ కు ఆయుధాలివ్వడం సరైనదే అయినా ఆ దేశం కూడా చర్చలకు మొగ్గు చూపాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఉక్రెయిన్ కు కష్టాలు తప్పవన్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు పోప్ కజకిస్తాన్ పర్యటనకు వచ్చారు. అక్కడ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దల కాంగ్రెస్‌కు హాజరయ్యారు.

Pope justified supplying weapons to Ukraine- says morally acceptable for self defence

45 నిమిషాలపాటు సాగిన ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపడం నైతికంగా సరైనదేనా అని అడిగారు. దీనికి సమాధానంగా పోప్ ఫ్రాన్సిస్ "ఇది రాజకీయ నిర్ణయం, ఇది నైతిక పరిస్థితులలో జరిగితే, ఇది నైతికంగా, నైతికంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది" అని ఫ్రాన్సిస్ చెప్పారు. దీనికి నిదర్శనంగా రోమన్ కాథలిక్ చర్చి "జస్ట్ వార్" సూత్రాలను వివరించారు. ఇది దురాక్రమణ చేసే దేశానికి వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం ప్రాణాంతక ఆయుధాలను దామాషా ప్రకారం ఉపయోగించడాన్ని అనుమతిస్తుందన్నారు.

English summary
Pope Francis has said that it was morally legitimate for nations to supply weapons to Ukraine for self defence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X