వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Porn Consumption: పోర్న్ బానిసలుగా యువత.. రోజుకు 14 గంటలు.. భారత్ లో పరిస్థితి ఇలా

|
Google Oneindia TeluguNews

Porn Consumption: కరోనా సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందించాయి. ఇది కొంత ఊరట కలిగించే విషయం అయినప్పటికీ చాలా మందికి ఇదొక కొత్త వ్యసనాన్ని అలవాటు చేసింది. తాజాగా వచ్చిన నివేదిక తెలిస్తే మీ మతి పోవటం పక్కా. అసలు మీడియాలో వచ్చిన సంచలన విషయాలు మీకోసం..

 కరోనా తెచ్చిన వ్యసనం..

కరోనా తెచ్చిన వ్యసనం..


వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో.. రిమోట్ వర్కింగ్ వల్ల అనేక మందిలో UKలో పోర్న్ పెరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే దీని నుంచి బయటపడేందుకు వైద్యుల సహాయం తీసుకుంటున్న UK పౌరుల సంఖ్య రెట్టింపు అయ్యిందని నిపుణులు చెప్పారు. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో కేవలం కొన్ని క్లిక్స్ దూరంలో ఉన్న టెంప్టేషన్.. చాలా మంది పోర్న్ వీక్షకులను వ్యసనపరులుగా మార్చినట్లు వారు చెబుతున్నారు.

 రోజుకు 14 గంటల పాటు..

రోజుకు 14 గంటల పాటు..


అశ్లీలతను చూడాలనుకోవటం కూడా ఒక రకమైన సెక్స్ వ్యసనం అని వైద్యులు చెబుతున్నారు. ఇది వారిలో ఆహ్లాదకరమైన అనుభూతికి లేదా లైంగిక కార్యకలాపాలకు కారణమై సమస్య ముదరటానికి కారణం అవుతుందని తెలిపారు. లండన్‌లోని లారెల్ సెంటర్, బ్రిటన్‌లోని అతిపెద్ద సెక్స్ అండ్ పోర్న్ అడిక్షన్ క్లినిక్ కొంత మందికి చికిత్సను అందిస్తున్నాయి. వీరిలో రోజుకు 14 గంటలు పోర్న్ చూసే బాధితులు ఉన్నట్లు వెల్లడించారు.

 పెరిగిన బాధితులు..

పెరిగిన బాధితులు..


లండన్‌లోని లారెల్ సెంటర్ 2022 మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 750 మంది పోర్న్ బానిసలను చూసింది. 2019 మొత్తానికి 950 మంది మాత్రమే ఉన్నారు. క్లినిక్ కు వచ్చిన రోగులకు మరింత ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అవసరమని వైద్యులు తెలిపారు. థెరపిస్ట్‌లు 2019లో నెలకు కేవలం 360 గంటల పాటు చికిత్స ఇచ్చేందుకు పనిచేసేవారు. అయితే.. ప్రస్తుతం వీరు రోగులకు నయం చేసేందుకు నెలకు 600 గంటలు వెచ్చిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీని నుంచి మనం గమనించవచ్చు.

 భారత్ లో పరిస్థితి ఇలా..

భారత్ లో పరిస్థితి ఇలా..

వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిలో ఒంటరిగా ఎక్కువ సమయం లభ్యత కారణంగా రాత్రిపూట కాకుండా పగటిపూట అశ్లీల వీడియోలను ఎక్కువ మంది చూస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ పరిస్థితి భారతదేశంలో కూడా కనిపిస్తున్నట్లు వారు వెల్లిడించారు. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న టీనేజర్లు పోర్న్ కు ఎడిక్ట్ అవుతున్నట్లు గమనించిన తల్లిదండ్రులు వారిని థెరపిస్టుల(వైద్యులు) వద్దకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.

 కేరళలో ఇలా..

కేరళలో ఇలా..


కరోనా సమయంలో చాలా మంది పోర్న్, ఆన్‌లైన్ గేమింగ్ కు ఎక్కువ మంది ఎడిక్ట్ అయ్యారు. వీరిని వ్యసనం నుంచి బయటపడేసేందుకు కేరళ పోలీసులు డిజిటల్ డి-అడిక్షన్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న యువత, పిల్లలను తల్లిదండ్రులు గమనించి సకాలంలో చికిత్స అందించటం అత్యవసరమని అక్కడి పోలీసులు సూచిస్తున్నారు.

English summary
A report claims that porn addiction had seen a rise with work from home culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X