అడవుల్లో మంటలు: 57 మంది మృతి, కార్లలోనే 30 మంది..

Posted By:
Subscribe to Oneindia Telugu

పోర్చుగల్: పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 57 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ప్రాణాపాయం పెద్ద ఎత్తున సంభవించింది.

దాదాపు అరవై మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు 160 అగ్నిమాపక యంత్రాలు, వందల సంఖ్యలో సిబ్బంది శ్రమిస్తుంది.

అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. కార్లకు మంటలు వ్యాపించడంతో కార్లలో ఉన్న వ్యక్తులు కాలి బూడిదయ్యారని అధికారులు పేర్కొన్నారు. కార్లలో చనిపోయిన వారే 30 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది.

Portugal forest fires kill 57 near Coimbra

దట్టమైన పొగ కారణంగా మరికొందరు మృతి చెందారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదానికి మెరుపులే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాటర్ ప్లేన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A catastrophic forest fire in Portugal has claimed at least 57 lives, officials say.
Please Wait while comments are loading...