ఉత్తరాఖండ్ లోని జోహార్ వ్యాలీ.. సమ్మర్ లో పర్ ఫెక్ట్ డెస్టినేషన్..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే ఈ మండు వేసవిలో చల్ల చల్లగా ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలని ఉందా..? అయితే ఉత్తరాఖండ్ లోని జోహార్ వ్యాలీ మీకు బెస్ట్ ఆప్షన్.. సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది నార్త్ ఇండియాలోని సిమ్లా, మనాలి ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ ఈ రెండింటినీ తలదన్నేలా జోహార్ వ్యాలీ ఉంటుంది. ఆ విషయం తెలియక చాలామంది ఈ ప్రాంతాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. కానీ ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే మళ్లీ తిరిగి రావాలనిపించదు.. సమ్మర్ లో ఈ పర్యటక ప్రాంతానికి ప్లాన్ చేసుకోండి..
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న జోహార్ వ్యాలీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ప్రాంతం కుమావున్ హిమాలయాల మధ్యలో, గోరి గంగా నది వెంబడి టిబెట్ బోర్డర్ వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా వేసవిలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అయితే ఈ వ్యాలీ గురించి బయటివాళ్లకు తెలియకపోవడం వల్ల ఇక్కడ పర్యటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ 'లిటిల్ కాశ్మీర్' అంటారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర పితోర్‌గఢ్ జిల్లాలో ఈ వ్యాలీ ఉంది. దీన్ని మిలామ్ వ్యాలీ లేదా గోరీ గంగా వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ లోయ గుండా గోరీ గంగా నది ప్రవహిస్తుంది. ఇక్కడి హిమాలయ శిఖరాలు, దట్టమైన అడవులు, జలపాతాలు పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. జోహార్ వ్యాలీ నుంచి నందాదేవి, నందా కోట్ వంటి ప్రసిద్ధ హిమాలయ శిఖరాలు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ లోయ చివరన ప్రసిద్ధ మిలామ్ హిమానీనదం ఉంది. ఇది పర్వతారోహకులకు ఒక స్వర్గధామంగా చెబుతారు.
ఇక ఈ వ్యాలీకి మంచు కురిసే సమయం అంటే మే నుంచి అక్టోబర్ మధ్యలో మాత్రమే వెళ్లగలం. ముఖ్యంగా వేసవిలో ఈ హిల్ స్టేషన్ లో పూసే రంగురంగుల పూలు, పచ్చని మైదానాలతో కన్నుల విందుగా అత్యద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నా.. ఇక్కడ మాత్రం పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటకపోవడం విశేషం. అందుకే వేసవిలో ఇక్కడికి వేలాదిమంది టూరిస్టులు తరవివస్తుంటారు. రద్దీ లేని ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఇది అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతం అని చెప్పొచ్చు. ఈ ప్రాంతానికి దగ్గరలో నందా దేవి టెంపుల్, ట్రైబల్ మ్యూజియం కూడా ఉన్నాయి.

జోహార్ వ్యాలీకి చేరుకోవాలంటే ముందుగా రైలు మార్గం అయితే కాత్‌గోదామ్ స్టేషన్ కు చేరుకోవాలి. విమానంలో అయితే పంత్‌నగర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. ఒకవేళ మీరు దిల్లీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే సుమారు 500 కి. మీ. ప్రయాణించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications