దశాబ్దాలుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ICMR షాకింగ్ రిపోర్ట్!

తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి వంటింట్లోనూ దశాబ్దాలుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ (Sunflower Oil) వాడకం ఒక అలవాటుగా మారిపోయింది. ఆరోగ్యానికి మంచిదనే ప్రకటనలను నమ్మి మెజారిటీ కుటుంబాలు లీటర్ల కొద్దీ సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే వాడుతున్నాయి.

అయితే, ఏళ్ల తరబడి కేవలం ఒకే రకమైన సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడటం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని, గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తుందని హైదరాబాద్‌లోని 'ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్' (ICMR-NIN) సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయుల ఆహార నియమావళిపై విడుదల చేసిన తాజా డైటరీ గైడ్‌లైన్స్‌లో వంటనూనెల వాడకంపై సంస్థ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు ఎంతో తెలుసా? అమ్మకాలకు బ్రేక్..
సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు ఎంతో తెలుసా? అమ్మకాలకు బ్రేక్..

ఎన్ఐఎన్ పరిశోధనల ప్రకారం.. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 'ఒమెగా-6' (Omega-6) ఫ్యాటీ యాసిడ్స్ మోతాదుకు మించి అత్యధికంగా ఉంటాయి. శరీరానికి ఒమెగా-6 అవసరమే అయినప్పటికీ, దశాబ్దాల తరబడి కేవలం దీనినే వాడటం వల్ల శరీరంలో ఒమెగా-3, ఒమెగా-6 ల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది.

ICMR-NIN Dietary Guidelines Using Only Sunflower Oil For Decades Increases Heart Attack And BP Risks

ఈ అసమతుల్యత వల్ల రక్తపోటు (బీపీ), ధమనులలో కొవ్వు పేరుకుపోవడం మరియు గుండె జబ్బుల ముప్పు ప్రమాదకర స్థాయికి పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో దొరికే ఏ ఒక్క వెజిటెబుల్ ఆయిల్‌లోనూ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, ఫ్యాటీ యాసిడ్‌లు సరైన నిష్పత్తిలో ఉండవని, అందుకే ఒకే నూనెకు పరిమితం కావడం తగదని స్పష్టం చేసింది.

గుండె ఆగిపోయేలా చేస్తున్న ఫుడ్స్! 65% మరణాల ముప్పు..
గుండె ఆగిపోయేలా చేస్తున్న ఫుడ్స్! 65% మరణాల ముప్పు..

ఆయిల్ రొటేషన్ పాటించండి!

ఈ పోషకాల లోపాన్ని అధిగమించడానికి ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించింది. అదే 'ఆయిల్ రొటేషన్' (నూనెలను మార్చి మార్చి వాడటం). ఏళ్ల తరబడి ఒకే బ్రాండ్ లేదా ఒకే రకం నూనెను వాడకుండా.. మార్కెట్లో లభించే ఆవనూనె (Mustard Oil), రైస్ బ్రాన్ ఆయిల్ (Rice Bran Oil), వేరుశనగ నూనె (Groundnut Oil) వంటి విభిన్న రకాల నూనెలను నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి మార్చి మార్చి వండాలని సూచించింది.

లేదా రెండు వేర్వేరు నూనెలను కలిపి (Blending) వాడటం వల్ల శరీరానికి సాచురేటెడ్, మోనో-అన్‌సాచురేటెడ్ (MUFA), పాలీ-అన్‌సాచురేటెడ్ (PUFA) ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్యంగా అందుతాయి. ఈ చిన్న మార్పుతో గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని జాతీయ మీడియా కథనాలు సైతం ప్రముఖంగా నివేదించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+