విజయ్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ వద్దు - ఇక మన రూటు అటే.. డీఎంకే సంచలనం..!!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం విజయ్ మిత్రపక్షా లకు తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. అసెంబ్లీలో బల పరీక్ష వేళ అండగా నిలిచిన అన్నా డీఎంకే చీలిక వర్గం ఆలోచన లో మార్పు వచ్చింది. పళినిస్వామికి తిరిగి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసి.. ఇప్పుడు విజయ్ కేబినెట్ లో చేరిన పార్టీల పైన డీఎంకే ఆగ్రహంగా ఉంది. వారితో కలిసేది లేదని తేల్చింది. ఇక.. తమ భవిష్యత్ మార్గం పైన స్పష్టత ఇచ్చింది.

తమిళనాడు రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణమని, తీరా గెలిచిన తర్వాత పదవుల కోసం తమతో మాట మాత్రమైనా చెప్పకుండా టీవీకే చెంతకు చేరారని అన్నారు. వారికి కనీస కృతజ్ఞత, మర్యాద లేని కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదని, వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని ఉదయనిధి పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి మోదీ, అమిత్ షా కారణమని నేను భావించాను. కానీ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని ఇప్పుడు స్పష్టమైంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మా నాయకుడు ఎంకే స్టాలిన్ తన భుజాలపై మోశారు' అని ఉదయనిధి పేర్కొన్నారు.

 దక్షిణ మధ్య రైల్వే కుదింపు - ఈ స్టేషన్లు, ప్రధాన రైళ్లు ఇక నుంచి..!!
దక్షిణ మధ్య రైల్వే కుదింపు - ఈ స్టేషన్లు, ప్రధాన రైళ్లు ఇక నుంచి..!!
udhayanidhi-stalin-has-exhorted-his-party-cadre-to-never-trust-the-congress-again-here-the-detail

మారుతున్న రాజకీయ సమీకరణాలు

కాగా, తమ మిత్రపక్షాల కష్టార్జితంపై బతుకుతున్న కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటుదారులు, జలగలని ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు అతి త్వరలోనే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కాగా, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లి.. క్యాబినెట్‌లో భాగమవడాన్ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా తప్పుబట్టారు. దీంతో.. ఇప్పుడు కాంగ్రెస్ సహా విజయ్ ప్రభుత్వంలో చేరిన పార్టీలతో కలిసి టీవీకే కూటమిగా కొనసాగనుంది. డీఎంకే సింగిల్ గానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అన్నా డీఎంకేలో చీలిక వర్గం ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ పరిస్థితుల ను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ నాయకత్వం.. మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉంది. దీంతో.. రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయం మరింత ఆసక్తికరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+