Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోర్చుగల్‌లో భారతీయ గర్భిణి మృతి: ఆ దేశ ఆరోగ్యమంత్రి రాజీనామా

లిస్బన్: పోర్చుగల్‌లో సరైన సమయంలో వైద్యం అందక భారతదేశానికి చెందిన ఓ చెందిన గర్భిణి మృతి చెందటంతో ఆ దేశ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, గర్భంతో ఉన్న భారత పర్యాటకురాలు సరైన వైద్యం అందక గుండెపోటుతో మృతి చెందంటతో నైతిక బాధ్యతవహిస్తూ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.

 Portugal Health Minister Marta Temido Resigns After Pregnant Indian Tourist Dies.

రాజధాని నగరం లిస్బన్‌లోని శాంటియా మారియా ఆసుపత్రిలోని నియోనాటాలాజీ విభాగం కిక్కిరిసిపోవడంతో 34 ఏళ్ల భారతీయ గర్భిణిని అక్కడి నుంచి అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి తరలించారు. అలా పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండగా ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో అత్యవసరంగా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

లిస్బన్ లో జరిగిన ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ..భారత పర్యాటకురాలి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రి మార్టా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. టెమిడో తనపదవికి రాజీనామా చేస్తూ ఇకపై షరతులు లేవు అని వెల్లడించారు. ఆమె రాజీనామాను ప్రధాని అంటోనియో కోస్టా ఆమోదించారు. ఈ విషయాన్ని పోర్చుగల నేషనల్ పబ్లిక్ బ్రాడక్ కాస్టర్ ఆర్టీపీ న్యూస్ తన కథనంలో పేర్కొంది.

కాగా, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవటంతో అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలన్నమంత్రి టెమిడో నిర్ణయించారు. ఆమె నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ, ప్రధాని అంటోనియో మాత్రం ఆరోగ్య శాఖా మంత్రిగా టెబిడోను సమర్థించారు.

అయితే, గత కొంత కాలంగా ఆస్పత్రుల్లోని ప్రసూతి యూనిట్లు నిండిపోతుండడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కారణంతోనే అంబులెన్స్‌లో భారతీయ పర్యాటకురాలిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో ఆమె మరణించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోగ్య మంత్రి మార్టాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే భారత పర్యాటకురాలి ప్రాణాలు పోయాయని మండిపడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆరోగ్యమంత్రి రాజీనామా చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+