వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదంపై బ్రిటన్ ప్రధానితో మోడీ చర్చలు..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్: లండన్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై బ్రిటీష్ ప్రధానమంత్రి థెరెసా మేతో చర్చలు జరిపారు. మధ్యాహ్నాం లంచ్ మీటింగ్ కు హాజరైన ఇద్దరు ప్రధానులు.. ఇరుదేశాల ప్రజల కోసం కలిసి పనిచేద్దామని నిర్ణయించారు.

Modi

ఈ సమావేశంతో బ్రిటన్-భారత్ సంబంధాలకు కొత్త శక్తి వస్తుందన్నారు మోడీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో బ్రిటన్ భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఇదో యుద్దం అని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఇది మన బాధ్యత అని చెప్పారు.
బసవేశ్వరుడి జన్మదినాన లండన్ లోని ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉన్నారు.

ఉగ్రవాదంపై:

బ్రిటన్ ప్రధానితో చర్చల్లో భాగంగా ఉగ్రవాద అంశంపై కూడా చర్చించారు మోడీ. లష్కరే తయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్ వర్క్, అల్ ఖాయిదా, ఐసిస్ వంటి నిషేధ ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థల పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. అమాయకులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నెట్ వర్క్ లు, వాటి ఆర్థిక వనరులను దెబ్బకొట్టేందుకు అన్ని దేశాలు పనిచేయాలన్నారు.

వేల్స్ యువరాజుతో భేటీ:

బ్రిటన్ ప్రధానితో భేటీ తర్వాత వేల్స్ యువరాజు చార్లెస్ తో సమావేశమయ్యారు మోడీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోడీని కలిసేందుకు ప్రవాస భారతీయులు, లండన్ లోని భారత సంతతి ప్రజలు పోటీపడ్డారు. మోడీ సెల్ఫీలు తీసుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi was today welcomed by Britain's Prince Charles at an exhibition organised to celebrate India's role in the history of science and technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X