వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ ఉద్యోగి మృతికి నేనే కారణం: నేరం ఒప్పుకున్న హై ప్రొఫైల్ కాల్ గర్ల్

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: గూగుల్ సంస్థలో పని చేసే ఎగ్జిక్యూటివ్ అధికారి ఫోరెస్ట్ హెయిస్(51) హత్య కేసులో తాను దోషినేనని హై ప్రొఫైల్ వ్యభిచారిణి అలెక్స్ కేథరిన్ టిచెల్మన్(27) అంగీకరించింది. ఈ మేరకు కాలిఫోర్నియా శాంతా క్రూజ్ సుపీరియర్ కోర్టు ఎదుట తెలిపింది.

2013, నవంబర్‌లో హెయిస్.. కాలిఫోర్నియా తీరంలో పడవలో సేదతీరుతున్న సమయంలో తాను మత్తుపదార్థం‘హెరాయిన్'ను అతనికి ఇంజెక్ట్ చేశానని ఆమె తెలిపింది. ఆయనలో మరింత ఉద్రేకం కోసమే ఆ పని చేసినట్లు చెప్పింది.

Prostitute Pleads Guilty in Google Executive's Heroin Death

నేరం అంగీకరించడంతో ఆమెపై ఉన్న హత్య కేసును అసంకల్పిత హత్య కేసుగా మార్చిన కోర్టు.. ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, నిషేధిత మత్తు పదార్థాలను కలిగివుండటం, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేయడం, వ్యభిచార వృత్తిలో ఉండటం వంటి ఆరోపణలు వాస్తవమేనని కేథరిన్ అంగీకరించింది.

ఇది ఇలా ఉండగా, అంతకుముందు ప్రాసిక్యూషన్ తన వాదన వినిపిస్తూ.. హెయిస్ ప్రాణపాయ స్థితిలో ఉంటే, కనీసం 911 నెంబర్‌కు ఫోన్ చేయకుండా నింపాదిగా మద్యం తాగి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సిసిటీవీ ఫుటేజీలో నమోదైందని కోర్టుకు వివరించారు.

English summary
A prostitute charged with killing a Google executive by injecting him with heroin on his yacht off the California coast pleaded guilty on Tuesday to involuntary manslaughter, court officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X