Putin India Visit:పుతిన్‌ మలం కోసం ప్రత్యేక సూట్ కేసు - ఏంటి ఈ కథ..!!

ఉక్రెయిన్‌పై దండయాత్ర తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా భారత పర్యటనకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ కీలక దౌత్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అమెరికాతో సుంకాల వివాదం, అస్థిర ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో పుతిన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, మాజీ కేజీబీ గూఢచారి అయిన పుతిన్ భద్రత కోసం ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ (FSO) అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వీటిలో నియంత్రిత ఆహార సరఫరాలు, ప్రైవేట్ బాత్రూమ్ ప్రోటోకాల్స్ తో పాటు, అంతర్జాతీయ పర్యటనలలో ఆయన వెంట ప్రత్యేకంగా వచ్చే 'పూప్ సూట్‌కేస్'(మలం ఉంచే సూట్‌కేసు) ఇప్పుడు ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

putins-india-visit-the-bizarre-poop-suitcase-security-detail-explained

'పూప్ సూట్‌కేస్' వెనుక రహస్యం ఏమిటి?
పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై (క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి) అనేక ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో, విదేశీ గూఢచర్య సంస్థలు తన ఆరోగ్యంపై సమాచారాన్ని సేకరించకుండా నిరోధించడానికి ఈ విచిత్రమైన భద్రతా చర్యను అనుసరిస్తున్నారు.

విధానం: విదేశీ పర్యటనల సమయంలో పుతిన్ ఉపయోగించిన మలాన్ని (Faecal Waste) ఆయన భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా సీల్ చేసిన బ్యాగుల్లో సేకరించి, ఆ ప్రత్యేక బ్రీఫ్‌కేస్‌లో తిరిగి మాస్కోకు పంపిస్తారని పలు నివేదికలు (పారిస్ మ్యాచ్ పత్రిక, ది ఇండిపెండెంట్) ధృవీకరించాయి.

చరిత్ర: విశ్లేషణ కోసం శత్రువుల మలాన్ని సేకరించడం గూఢచర్య ప్రపంచంలో పాత పద్ధతిగా చెబుతారు. 1949లో జోసెఫ్ స్టాలిన్ కూడా మావో జెడాంగ్‌ మల నమూనాలను సేకరించమని ఆదేశించినట్టు చరిత్ర చెబుతోంది.

ప్రయాణాలు: పుతిన్ ఫ్రాన్స్, వియన్నా, సౌదీ అరేబియా మరియు ఇటీవలి అలస్కా సమ్మిట్ వంటి అనేక పర్యటనల్లో ఈ 'పూప్ కేస్' ను ఉపయోగించినట్లు ఇంటర్నెట్ ఆధారాలు సూచిస్తున్నాయి.పుతిన్ తీసుకుంటున్న ఈ అత్యంత రహస్య చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆరోగ్యం గురించిన ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

పుతిన్ భారత పర్యటన ఇలా..!!
ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సాయంత్రం భారత్‌కు చేరుకుంటారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విమానం ల్యాండ్ అవుతుంది. పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రధాని మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన డిన్నర్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.అనంతరం రాష్ట్రపతితో భేటీ అవుతారు. ఆ తర్వత ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జాతిపిత మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హౌజ్‌లో ఇండియా రష్యా దేశాల మధ్య జరిగే సమావేశంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొంటారు.పలు రంగాలపై చర్చలు జరుపుతారు.అన్ని అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు రష్యాకు బయలుదేరి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+