సిరియాలో లైంగిక దాడులపై యూఎన్ఓ నివేదిక: అన్న ముందే చెల్లెలిపై రేప్, నగ్నంగా మహిళల ఊరేగింపు
వాషింగ్టన్: సిరియాలో మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తేటతెల్లం చేసింది. సాటి మనుషులుగా కూడ మహిళలను చూసే పరిస్థితులు కన్పించడం లేదు. మహిళలను సెక్స్ కోసం తీవ్రంగా హింసిస్తున్నారని ఆ నివేదిక బట్ట బయలు చేసింది. సుమారు 450 మందిని విచారించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేసినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.మరో వైపు స్త్రీలతో పాటు పురుషులు కూడ లైంగికదాడులకు గురౌతున్నట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
సిరియాలో ఒక వైపు నరమేథం సాగుతోంది. మరో వైపు శాంతి స్థాపన కోసం మహిళలపై యధేచ్చగా లైంగిక దాడులు కొనసాగుతున్నాయి పునరావాస కేంద్రాలతో పాటు సహయం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మహిళలకు సహయం చేసేందుకు కూడ లైంగిక దాడులకు దిగుతున్నారని ఇదివరకే ఓ సంస్థ ప్రకటించింది.
దీనికితోడు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ సిరియాలో మహిళల బాధలను కళ్ళకు కట్టినట్టుగా చూపుతోంది. బతకలేక జీవచ్చవాల మాదిరిగా సిరియాలో మహిళలు జీవనం సాగిస్తున్నారు.

సిరియాలో మహిళలపై లైంగిక దాడులు
సిరియా అంతర్యుద్ధంలో మహిళలు పావులుగా మారుతున్నారు. వందలాది మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక బట్టబయలు చేసింది. సుమారు 450 మందికిపైగా మహిళలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను విడుదల చేసింది. సభ్యసమాజం తలదించుకొనే రీతిలో మహిళలపై సిరియాలో అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయి. దౌర్జన్యంగా ఇళ్ళలోకి వచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని సిరియాలో మహిళలు వివరించారు.

సోదాల పేరుతో ఇంట్లోకి వచ్చి రేప్
సోదాల పేరుతో ఇంట్లోకి వచ్చిన సాయుధాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక బట్టబయలు చేసింది. తమకు శత్రువులుగా భావించే వారి ఇళ్ళను సోదా చేసే పేరుతో దుండగులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆయుధం ధరించిన ఓ వ్యక్తి ఇల్లును చూపించాలని చెప్పి తన వెనుకే వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ బాధితురాలు ఐక్యరాజ్యసమితి నివేదిక తయారు చేసేందుకు వెళ్ళిన ప్రతినిధులకు వివరించింది.

సోదరుడి ముందే చెల్లి రేప్
అయితే మరో దారుణ ఘటనను కూడ ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఓ భాధితురాలిని సోదరుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఆయా ప్రాంతాల్లోని మగవారిని లొంగదీసుకొనేందుకు మహిళలను పావుగా వాడుకొంటున్నారు. మహిళలపై అత్యాచారాలు చేస్తూ మగవారిని తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో యుద్ద ట్యాంకులకు ముందే మహిళలను నగ్నంగా నడిపించిన ఘటలను కూడ కొందరు బాధితులు చెప్పారని ఆ నివేదిక వెల్లడించింది.

గుంపులుగా తీసుకెళ్ళి అత్యాచారం
ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడ తమ ప్రత్యర్ధులకు పట్టు ఉన్న ప్రాంతాల్లో అధిపత్యం కోసం మహిళలను పావులుగా ఉపయోగించుకొంటున్నారని తేలింది. మహిళలు, బాలికలను గుంపులుగా నిర్భంధ గృహలకు తరలిస్తారు. అలా తరలించే సమయంలో కొందరిని వారి నుండి వేరు చేస్తారు. వేరు చేసిన వారిపై రోజుల తరబడి అత్యాచారాలకు పాల్పడుతారు. మధ్య వయస్సు స్త్రీలను కూడ వదలరు. మహిళల జననాంగాలను తాకుతూ వికృతానందం పొందేవారని ఆ నివేదిక వెల్లడించింది.

పురుషులపై అత్యాచారాలు
నిర్భంధ గృహల్లోని పురుషులపై కూడ అత్యాచారాలు చోటు చేసుకొంటున్న ఘటనలు కూడ సిరియాలో వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా అనుమానించినవారికీ ఈ నిర్భంధ గృహల్లో బంధిస్తున్నారు పురుషుల సున్నిత ప్రదేశాల్లో రాడ్లు, పైపులను తోస్తున్నారు. అంతేకాదు అసహజ శృంగారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడి చేసింది.

పురుగులతో శరీరాన్ని కప్పుకొన్న బాధితురాలు
దుర్మార్గాల చేతి నుండి తనను తాను రక్షించుకొనేందుకు ఓ మహిళ తీవ్రమైన చర్యకు పాల్పడింది. రక్తం, మూత్రం, పురుగులతో తన శరీరాన్ని కప్పుకొంది. దీంతో ఆ మహిళ జోలికి ఎవరూ కూడ వెళ్ళలేదు. పర పురుషుల చేతిలో అపవిత్రం కాకుండా ఉండేందుకు తనకు అంతకంటే మరో మార్గం లేదని ఆ బాధితురాలు తేల్చి చెప్పింది












Click it and Unblock the Notifications