ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసిన ట్రంప్..జిన్‌పింగ్ కోసం రన్ వేపై గ్రాండ్ వెల్కమ్!

ప్రపంచాన్ని శాసించాలని తహతహలాడే ఇద్దరు మహానాయకులు ఒకే వేదికపైకి వచ్చారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధికారిక పర్యటన నిమిత్తం అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ భేటీకి సంబంధించి తొలి ఘట్టంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు. దౌత్యపరమైన పాత పద్ధతులను, ప్రోటోకాల్‌ను పూర్తిగా పక్కనబెట్టి, నేరుగా సైనిక స్థావరానికి చేరుకుని జిన్‌పింగ్‌కు స్వయంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మూడేళ్ల క్రితం అమెరికా వచ్చినా, వాషింగ్టన్ రాజధాని నగరాన్ని సందర్శించడం మాత్రం జిన్‌పింగ్‌కు పదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రోటోకాల్ పక్కనబెట్టి ప్రత్యేక స్వాగతం

వాషింగ్టన్ సమీపంలోని మేరీల్యాండ్‌లో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్ మిలిటరీ విమానాశ్రయంలో జిన్‌పింగ్ విమానం దిగగానే, ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి రన్‌వే పైకే వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ విమానం దిగగానే ట్రంప్ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. అమెరికా అధ్యక్షుల చరిత్రలో ఇలా ఒక విదేశీ నాయకుడికి విమానం వద్దకు వెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదు. గతంలో 2015లో పాప్ ఫ్రాన్సిస్ వచ్చినప్పుడు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రమే ఈ రకమైన అత్యున్నత గౌరవం ఇచ్చారు. ఆర్మీ బ్యాండ్ మేళతాళాలు, ఫిరంగుల గర్జనలు, గగనతలంలో వినువీధిలో బి-1 బాంబర్ యుద్ద విమానాల విన్యాసాల మధ్య ఇద్దరు నేతలు ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేసుకుని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

Rare Red-Carpet Reception Trump Breaks Protocol for Xi Jinping Landmark State Visit to Washington

త్రువులం కాదు.. భాగస్వాములం: జిన్‌పింగ్ సందేశం

అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వెంటనే చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ద్వారా జిన్‌పింగ్ తన తొలి స్పందనను తెలియజేశారు. చైనా, అమెరికాలు ఒకదానికొకటి పోటీదారులుగా లేదా శత్రువులుగా మారకూడదని, భాగస్వాములుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు కలసికట్టుగా పరస్పర గౌరవంతో ముందుకు సాగితేనే ఈ పర్యటన విజయవంతం అవుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గురువారం వైట్ హౌస్‌లో జరగబోయే ద్వైపాక్షిక సీరియస్ చర్చలు విశ్వవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

చర్చల టేబుల్‌పై కీలక అంశాలు.. ట్రేడ్ వార్ కు తాత్కాలిక బ్రేక్

ఈ పర్యటనలో హంగులు, ఆర్భాటాలు ఎంత ఉన్నాయో.. అంతర్గతంగా చర్చించాల్సిన వివాదాస్పద అంశాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చకుండా నవంబర్ 10తో ముగియాల్సిన తాత్కాలిక ఒప్పందాన్ని వచ్చే ఏడాది జనవరి 10 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఈ భేటీకి ముందే చైనా ఉప ప్రధాని హే లిఫెంగ్‌తో జరిపిన చర్చల్లో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక గురువారం నాటి భేటీలో దిగుమతి సుంకాలు, డ్రగ్స్ రవాణా నిరోధం, రెండు దేశాల సైన్యాల మధ్య మెరుగైన సమాచారం వంటి అంశాలపై ముందడుగు పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో అగ్రపీఠం కోసం ఇరు దేశాల మధ్య నడుస్తున్న తీవ్ర పోటీ, దానివల్ల వచ్చే ప్రమాదాల నియంత్రణ కూడా ప్రధాన చర్చనీయాంశం కానుంది.

Xi Jinping: దశాబ్దం తర్వాత వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్న చైనా బాస్
Xi Jinping: దశాబ్దం తర్వాత వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్న చైనా బాస్

తైవాన్, ఇరాన్ వివాదాలు: సంక్లిష్టంగా మారిన దౌత్యం

ఈ చర్చల్లో అత్యంత సంక్లిష్టమైన అంశం 'తైవాన్'. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని చైనా పదే పదే వాదిస్తుండగా, అమెరికా మాత్రం ఆ ద్వీపదేశానికి రక్షణగా నిలుస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆయుధాలను విక్రయిస్తోంది. గత డిసెంబర్‌లోనే 11 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీకి ట్రంప్ సర్కార్ ఆమోదం తెలపగా, మరొక 14 బిలియన్ డాలర్ల విక్రయం పెండింగ్‌లో ఉంది. ఈ విక్రయాలను తగ్గించాలని జిన్‌పింగ్ పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ సంక్షోభం, చమురు విపణి స్థిరత్వం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా సహకారం కావాలని అమెరికా భావిస్తుండగా, తనకు ఎవరి సాయం అక్కర్లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం.

టెక్ దిగ్గజాలతో గ్రాండ్ డిన్నర్.. నేషనల్ ఆర్కైవ్స్ సందర్శన

గురువారం రాత్రి వైట్ హౌస్‌లో జిన్‌పింగ్ గౌరవార్థం ట్రంప్ అత్యంత వైభవంగా స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ విందుకు కార్పొరేట్ ప్రపంచం నుంచి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా అధినేత జెన్సన్ హుయాంగ్, ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మ్యాన్ వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు. దీనితో పాటు అమెరికా రాజ్యాంగం, స్వాతంత్ర్య ప్రకటన పత్రాలు ఉన్న చారిత్రక 'నేషనల్ ఆర్కైవ్స్' ను కూడా జిన్‌పింగ్ సందర్శించనున్నారు. గత మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ లభించిన అత్యున్నత గౌరవానికి ప్రతిఫలంగానే అమెరికా కూడా ఈ స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?
Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?

రాజకీయ వ్యూహాలు.. ఆర్థిక సవాళ్లు

బహిరంగంగా నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం ఇద్దరు నేతల వద్ద స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయి. వచ్చే నవంబర్‌లో అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల, ఇరాన్ యుద్ధ ప్రభావంతో ట్రంప్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మరోవైపు చైనాలో ఎగుమతులు బాగానే ఉన్నప్పటికీ, సొంత దేశంలో వ్యాపారాలు మందగించడం, రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురుదెబ్బ తగలడం జిన్‌పింగ్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఆర్థిక, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, ఈ పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో చైనాలో జరిగే అపెక్ (APEC) లేదా డిసెంబర్‌లో అమెరికాలో జరిగే జీ20 సమ్మిట్‌లో వీరిద్దరూ మళ్లీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+