జర్మనీ వీక్లీ రిపోర్ట్: సద్దాం హుస్సేన్ హయాంలోనే ఐఎస్ఐఎస్‌కు మాస్టర్ ప్లాన్
న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న ఐఎస్ఐఎస్‌కు మాస్టర్ ప్లాన్ ఇరాక్ నియంత నేత సద్దాం హుస్సేన్ హయాంలోనే పడ్డాయని జర్మనీకి చెందిన వీక్లీ డెర్ స్పీగెల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఉత్తర సిరియాపై ఆధిపత్యం కోసం ఇస్లామిక్ స్టేట్ బ్లూ ప్రింట్‌ను ఆయనే సిద్ధం చేశాడని ఆ పత్రిక పేర్కొంది.
సద్దాం హుస్సేన్ ప్రధాన అనుచరుడు, ఇంటిజిజెన్స్ హెడ్‌గా పనిచేసిన సమీర్ మహమ్మద్ అల్ ఖలీపా అలియాస్ హాజీ బకర్ నేతృత్వంలో ఐఎస్ఐఎస్‌కు రూపకల్పన జరిగిందని ఆ పత్రిక ప్రధానంగా రాసింది. జనవరి 2014లో సిరియా రెబల్స్ హాజీ బకర్‌ను కాల్చి చంపిన సంగతి విషయం తెలిసిందే.
సిరియా ప్రాంతంలో 'కాలిఫేట్' ఏర్పాటు, గూఢచర్య కార్యకలాపాలు, హత్యలు, కిడ్నాప్‌లకు ఆయనే దగ్గరుండి ప్రణాళికలు రూపొందించాడని పేర్కొంది. 2006 నుంచి 2008 మధ్య కాలంలో అమెరికా సైన్యం ఆధీనంలో బుక్కా, అబూ ఘారైబ్ జైల్లో ఉన్న ఆయన, ఆ సమయంలో జీహాదీలతో సంబంధాలు పెంచుకుని ఈ ఐఎస్ఐఎస్‌కు రూపకల్పన చేశారని పేర్కొంది.

ఐఎస్ఐఎస్ రూపకల్పనకు ఆయనకు ఇరాకీ సైన్యాధికారులూ కూడా సహకరించారని తెలిపింది. బకర్‌కు చెందిన అతి రహాస్య 31 పత్రాలను సంపాదించినట్లు తెలిపింది. దక్షణ సిరియాలోని అలెప్పోలో ఉన్న రెబెల్ గ్రూప్‌తో బకర్ జరిపిన సమాలోచనలు, చేతితో రాసిన జాబితాలు, పటాలతో సహా అన్నింటిని పేర్కొంది.
ఐఎస్ఐఎస్ అకృత్యాలకు పెట్టింది పేరు. జూన్ 2014న ఇంటర్నెట్‌లో ఓ భయంకరమైన వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నుంచి మహిళలపై రేప్‌లు, జర్నిలిస్ట్‌లకు శిరచ్ఛేదనం సహా హింస భయంకరమైన సంఘటనలతో ఆధునిక సమాజం విస్తతబోయే సంఘటనలకు పాల్పడుతోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications