నేపాల్ భూకంపంలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక వెబ్‌సైట్
న్యూఢిల్లీ: వరుస భూప్రకంపనలతో నేపాల్ అతలాకుతులమైన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా తప్పిపోయిన బాధితుల కోసం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఆన్‌లైన్‌లో ఒక పేజీని ప్రారంభించింది. నేపాల్ భూకంపంలో తప్పిపోయిన వారు ఈ పేజీలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల రెడ్ క్రాస్ సంస్ధ వారిని గుర్తించి కుటుంబ సభ్యులతో కలుపుతారు.
నేపాల్ భూకంప బాధితుల కోసం రెడ్ క్రాస్ ఆన్‌లైన్ పేజీ
పైన పేర్కొన్న వెబ్‌సైట్ ద్వారా తప్పిపోయిన వారు తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేస్తూ తమ పేరు, వివరాలతో రిజిస్టర్ చేసుకునే కోవాలి. రిజిస్టర్ చేసుకున్న వారి జాబితాను కూడా ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఈ వెబ్‌సైట్‌ను నేపాల్ భాషతో పాటు ఇంగ్లీషులో ఉంచారు. ఇది ఇలా ఉంటే భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం ప్రకటించింది. నేపాల్ పునర్నిర్మాణానికి పూర్తి సహాకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాండ్‌కిమ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications