వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రధాని రేసు : రిషి సునాక్ 188-పెన్నీ మోర్డాంట్ 27- కాసేపట్లో విజేత ప్రకటన

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషీ సునాక్ ఎన్నికవడం ఖాయమైపోయింది. లిజ్ ట్రస్ రాజీనామాతో జరుగుతున్న కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్ధి ఎంపికలో సునాక్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. నిన్నటి వరకూ 100కు పైగా ఎంపీల మద్దతు సాధించిన ఆయన.. ఇవాళ ఒక్కరోజే మరో 88 మంది ఎంపీల మద్దతు సంపాదించగలిగారు. ఆయనతో పోటీ పడుతున్న మహిళా అభ్యర్ధి పెన్నీ మోర్డాంట్ ఇప్పటివరకూ కేవలం 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే సాధించారు.

రిషీతో పోటీలో నిలవాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు సాధించాల్సిన పరిస్ధితుల్లో బరిలోకి దిగిన పెన్నీ మోర్డాంట్ పై పార్టీ ప్రజాప్రతినిధుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఆమెకు ఇప్పటివరకూ కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే మద్దతు పలికారు. మరోవైపు 188 ఎంపీల మద్దతుతో దూసుకుపోతున్న సునాక్ కు ఆమె పోటీ ఇవ్వడం అటుంచి పరువు కాపాడుకుంటే చాలనే పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో ఇప్పటివరకూ ఆమెకు మద్దతిచ్చిన ఎంపీలు సైతం రిషీ సునాక్ తో డీల్ కు రావాలని ఆమెకు సూచిస్తున్నారు.

 rishi sunak inch closer to uk prime minister contest with 188-27 lead on penny mordant

ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో గతంలో ఆర్దికమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రిషీ సునాక్ ను ఎంచుకోవడమే మేలన్న భావనలో కన్వర్వేటివ్ పార్టీ ఎంపీలున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీలో పోటీని పక్కనబెట్టి సునాక్ కు మద్దతిమ్మని ఆయన ప్రత్యర్ధి పెన్నీ మోర్డాంట్ కు సూచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా పార్టీలో ఐక్యతను కూడా కాపాడాలని ఎంపీలు ఆమెను కోరుతున్నారు. కానీ ఆమె మాత్రం ఇప్పటివరకూ పోటీలోనే ఉండటంతో మరికొద్ది గంటల్లో ఓటమి ఖరారయ్యేలా కనిపిస్తోంది. బ్రిటన్ లో స్ధానిక సమయం ప్రకారం రాత్రి 7.30 గంటల వరకూ ఆమె కనీసం 100 ఎంపీల మద్దతు కూడగట్టగలిగితే పోటీలో నిలుస్తారు. లేకపోతే మాత్రం రిషీ సునాక్ ను ప్రధానిగా ప్రకటించే అవకాశముంది.

English summary
indian origin britisher rishi sunak has inch closer to uk's next prime minister with 188-27 votes majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X