పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 60 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది వరకు దుర్మరణం చెందారు. అందులో 21 మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. 15 మందికి గాయలుపాలయ్యారు. పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఖైబర్-పాఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి 70 మంది ప్రయాణికులతో కరాచి వెళుతుండగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో వెంటనే ఇంధన ట్యాంకు పేలి మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు బాధితులను సుక్కుర్, ఖైర్‌పూర్‌లోని ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు.

ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ట్రక్కును ఢీ కొట్టిందని స్థానిక మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అవుతున్నా... ట్రాఫిక్ అధికారులు మాత్రం.. పెట్రోల్ బంక్ నుంచి ఇంధనాన్ని నింపుకొని రోడ్డుమీదకు వస్తుండగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొందని చెబుతున్నారు.
ఈ ఘటనకు ముఖ్య కారణం సామర్థ్యానికి మించి ప్రయాణికులతో బస్సు వెళుతుండటమేనని అక్కడి స్ధానికులు మీడియాతో తెలిపారు.












Click it and Unblock the Notifications