ప్రపంచం మమ్మల్ని నమ్మడం లేదు: రష్యా

మాస్కో: యూనియన్ సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్) పునర్నిర్మాణంపై పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రష్యాను ప్రపంచ దేశాలు నమ్మడం లేదని విచారం వ్యక్తం చేశారు.

పతనమై పాతికేళ్లు కావస్తున్న తరుణంలో రష్యా మళ్లి యూఎస్ఎస్ఆర్ ను నిర్మిస్తోందంటూ అమెరికా, యూరప్ అంతటా చెలరేగుతున్న పుకార్లను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని బూచిగా చూపిస్తూ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

రష్యాపై పశ్చిమ దేశాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దుంటూ పుతిన్ మాట్లాడిన ప్రత్యేక డాక్యుమెంట్ ను పబ్లిక్ రష్యా చానెల్ సోమవారం ప్రసారం చేసింది. తాము యూఎస్ఎస్ఆర్ ను పునర్మించాలనుకోవడం లేదని పుతిన్ స్పష్టం చేశారు.

Russia is not trying to bring back the USSr: Vladimir Putin

అయితే ఈ విషయాన్ని ప్రపంచం నమ్మటం లేదని అన్నారు. తామే గొప్ప అంటూ భావించే పశ్చిమ దేశాలు ప్రపంచంలోని మిగతా దేశాలపై ఇలాంటి అసత్య ఆరోపణలు చెయ్యడం ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై చూపించే ఆసక్తిలో సగమైనా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలపై చూపిస్తే ప్రపంచంపరిస్థితి మెరుగై ఉండేదని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము చెప్పే నిజాన్ని ఆమెరికా, యూరప్ దేశాలు ఎప్పటికీ అంగీకరించవని పుతిన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+