రష్యన్లకు ఇండియన్ మూవీస్ చాలా ఇష్టం - పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోచి నగరంలో జరిగిన వాల్డాయ్ చర్చా వేదికలో భారతీయ సినిమాలపై తన అభిమానాన్ని బయటపెట్టారు. రష్యా ప్రజలు భారతీయ సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. సాంస్కృతిక అనుభవంగా కూడా ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. రష్యన్స్ భారతీయ సినిమాలను ప్రేమిస్తున్నారని.. భారతీయ సినిమాలను పగలు, రాత్రి ప్రసారం చేసే ప్రత్యేక ఛానెల్ ఉన్న ఏకైక దేశం రష్యా అని వెల్లడించారు.

పుతిన్ మాట్లాడుతూ.. భారత్-రష్యా సంబంధాలు కేవలం రాజకీయాలు, దౌత్య పరిమితిలకు కాకుండా.. సాంస్కృతిక, మానవీయ సంబంధాల పరంగా కూడా విస్తరించాయన్నారు . రష్యాలో అనేక భారతీయ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వారి ద్వారా భారతీయ సంస్కృతి, ముఖ్యంగా సినిమాలకు రష్యా ప్రజల్లో విస్తృత ఆదరణ ఏర్పడిందని ఆయన చెప్పారు. భారతీయ సినిమాలు రెండు దేశాల ప్రజలను ఒకదానితో ఒకటి కలిపే సాధనం అని పుతిన్ స్పష్టం చేశారు.

russia-president-putin-interesting-comments-on-indian-movies

డిస్కో డాన్సర్ రికార్డ్..

కాగా సోవియట్ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. మిథున్ చక్రవర్తి, రాజ్‌కపూర్ వంటి స్టార్ హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మిథున్ నటించిన 1982లో విడుదలైన 'డిస్కో డాన్సర్' సోవియట్ యూనియన్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే రాజ్‌కపూర్ నటించిన 'ఆవారా' సైతం విదేశాల్లో 100 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక గతేడాది BRICS సదస్సులో కూడా పుతిన్ భారతీయ సినిమాల ప్రాధాన్యతను గుర్తుచేశారు. రష్యాలో కేవలం బాలీవుడ్ సినిమాలే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు భాషల సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. టెలివిజన్, యూట్యూబ్, OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ప్రతి రోజు భారతీయ సినిమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పుతిన్ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశాన్ని సందర్శించనున్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+