Russia VS Ukraine: 2 లక్షల మందితో రష్యా ట్రైలర్, భారత్ మీద ఇది ప్రభావం, పుతిన్ వార్నింగ్ !
మాస్కో/ న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో అగ్రదేశాలు ఊహించినట్లే పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పు ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగిస్తోందని కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఇక ఉక్రెయిన్ లోని ఖార్ కివ్ ప్రాంతంలో రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోందని సమాచారం. రష్యా-ఉక్రెయిన్ వివాదం భారత్ మీద తీవ్రప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతోంది.
Recommended Video
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. కొంతకాలం క్రితం వరకు భారతదేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడంతో హడలిపోయిన భారతీయులు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో చమురు ధరలు మరింత పెరిగిపోయే అవకాశం ఉండటంతో మనోళ్లు హడలిపోతున్నారు. 2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపిన రష్యా ఉక్రెయిన్ మీద పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యింది. మా విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పునిత్ సూచించారు. మా విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ల మీద కచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ హెచ్చరించారు.

రెండు లక్షల మందిని రంగంలోకి దింపిన రష్యా
ఉక్రెయిన్ మీద పగతో రగిలిపోతున్న రష్యా చివరికి ఆదేశం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగిపోయింది. రష్యా-ఉక్రెయిన్ ల మద్య యుద్దం జరిగితే అనేక దేశాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇప్పటికే చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అవి ఏవీ పట్టించుకోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ 2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపి ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించారు.

బాంబుల మోత...... ఫోటోలు వైరల్
రష్యా-ఉక్రెయిన్ వివాదంలో అగ్రదేశాలు ఊహించినట్లే పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పు ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగిస్తోందని కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి,

భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
ఇక ఉక్రెయిన్ లోని ఖార్ కివ్ ప్రాంతంలో రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోందని సమాచారం. రష్యా-ఉక్రెయిన్ వివాదం భారత్ మీద తీవ్రప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు.

పెట్రోల్, డీజల్ ధరలకు రెక్కలు
భారతదేశంలో 2015 నుంచి కనీవినీ రీతిలో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ముడి చమురు బారెల్ ధర దాదాపు 90 డాలర్లు దాటిపోయింది, ఇప్పుడు రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలతో ముడిచి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకు పైగా పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఈ దెబ్బతో భారతదేశంలో కూడా పెట్రోల్ ధర రూ. 6 నుంచి 7 రూపాయలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన రష్యా
2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపిన రష్యా ఉక్రెయిన్ మీద పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యింది. మా విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పునిత్ సూచించారు. మా విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ల మీద కచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications