వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-ఉక్రెయిన్ వార్ : యూఎస్-రష్యా రక్షణ మంత్రుల చర్చలు- యుద్ధం మొదలయ్యాక తొలిసారి

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా ఇప్పటికీ యుద్ధం ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది. తమ దేశ భద్రత కోసమంటూ యుద్ధం ప్రారంభించిన రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా రోజూ భారీగా నష్టపోతున్నాయి. అయినా వెనక్కి తగ్గేందుకు ఇరుపక్షాలూ నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం తాజా పరిస్ధితిపై ప్రపంచ దేశాల్లో కలవరం పెరుగుతోంది.

ఇన్నాళ్లూ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తప్పుబడుతూ ఆ దేశానికి ఆయుధాలు కూడా అందిస్తున్న యూఎస్ కూడా తాజా పరిస్ధితిపై పెదవి విరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ఫలితం తేలకపోవడంపై నిరాశగా ఉన్న్న యూఎస్.. తాజాగా రష్యాతో చర్చలకు తెరలేపింది. ఈ మేరకు రష్యా రక్షణమంత్ర సెర్గీ షోయిగూ .. యూఎస్ రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ తో చర్చలు జరిపారు. యుద్ధం కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇతర దేశాలపై పడుతున్న ప్రభావంపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

russia-ukraine war : For the First time, US, Russia defense chiefs discussion

ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో యూఎస్-రష్యా సంబంధాలు కూడా క్షీణించిన నేపథ్యంలో.. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ తో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధంలో ఎటువంటి మార్పును ఈ చర్చలు సాధించలేకపోయినట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ లైన్‌లను తెరిచి ఉంచే ప్రయత్నంలో గంటసేపు వీరిద్దరి మధ్య సాగిన సంభాషణ ముఖ్యమైనదని ఆస్టిన్ భావిస్తున్నా..అది ఎటువంటి కీలక సమస్యలను పరిష్కరించలేదని తెలుస్తోంది . రష్యా చేస్తున్న యుద్ధంలో మార్పులకు కూడా ఈ చర్చలు దోహదం చేయలేదని సమాచారం. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించకుండా ఉండేందుకు ఇరుదేశాల రక్షణ మంత్రులు ఓసారి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

English summary
for the first time, us and russian defence chiefs have discussed on ongoing russia-ukraine war sitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X