వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో ప్రపంచ యుద్ధమే- రష్యా తీవ్రహెచ్చరిక-ఉక్రెయిన్ కు పాశ్చాత్య సాయంపై ఫైర్

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి రెండు నెలలు గడిచిపోతోంది.అయినా ఇప్పటికీ ఫలితం తేలడం లేదు. ఓవైపు రష్యా ఒక్కో ప్రాంతం స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్తున్నా ఉక్రెయిన్ లో మాత్రం పరిస్ధితులు భిన్నంగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, దాని వెనుకున్న పశ్చిమ దేశాల మిలటరీ సాయం. దీంతో ఉక్రెయిన్ కు సాయం చేయడం ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా ఇవాళ పశ్చిమదేశాల్ని హెచ్చరించింది.

 ఉక్రెయిన్ లో సుదీర్ఘ పోరు

ఉక్రెయిన్ లో సుదీర్ఘ పోరు

ఉక్రెయిన్ పై దండయాత్రకు బయలుదేరిన రష్యా దీన్ని వారం రోజుల్లో ముగిస్తుందని అంతా అనుకున్నారు. ఉక్రెయిన్ తో పోలిస్తే ఎన్నో రెట్లు పటిష్టమైన సైన్యం, ఆయుధాలు, అణుబాంబులు..ఇలా ఏ విధంగా చూసినా దుర్భేద్యంగా కనిపిస్తున్న రష్యాదే విజయమని ఆశించారు. రష్యా కూడా ఇదే నిజమని అనుకుంది. కానీ అక్కడ రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ పై పోరు ఎంత కష్టమైనదో రష్యాకు అర్ధం కాలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ఎప్పుడు బయటపడదామా అన్న తొందర రష్యాలో కనిపిస్తోంది. ఇప్పటికే భారీ నష్టాలు చవిచూసిన రష్యాకు ఇక అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు.

పశ్చిమదేశాల సాయం

పశ్చిమదేశాల సాయం

ఉక్రెయిన్ పై పోరును త్వరగా ముగించడంలో విఫలమైన రష్యాకు పాశ్చాత్య దేశాలు క్రమంగా షాకులు ఇవ్వడం మొదలుపెట్టాయి. తొలుత రష్యాను అతిగా ఊహించుకున్న పాశ్చాత్య దేశాలు తాము ఉక్రెయిన్ కు అండగా రంగంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని భయపడ్డాయి. కానీ రోజులు గడిచే కొద్దీ రష్యాకు అంత సీన్ లేదనే నిర్ణయానికి వచ్చేశాయి. దీంతో ఉక్రెయిన్ కు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయడం మొదలుపెట్టాయి. దీన్ని వాడుకుంటూ ఉక్రెయిన్ కూడా రష్యాకు చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకీ ఉక్రెయిన్ నుంచి ముదురుతున్న ప్రతిఘటనతో రష్యా ఆత్మరక్షణలో పడింది.

మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు

మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు

ఉక్రెయిన్ కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అందిస్తున్న సాయంపై రష్యా ఇవాళ తీవ్రంగా స్పందించింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవం అంటూఓ ప్రకటన విడుదల చేసింది. మూడో ప్రపంచ యుద్ధం కోరుకోవడం లేదంటూ ప్రతీ ఒక్కరూ మంత్రాలు పఠిస్తున్నారని, కానీ అవసరమైనప్పుడు కాకుండా కృత్రిమంగా సృష్టిస్తున్న అణు సంఘర్షణ ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

రష్యా ఓడిపోయిందన్న ఉక్రెయిన్

రష్యా ఓడిపోయిందన్న ఉక్రెయిన్

రష్యా చేసిన మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలపై ఉక్రెయిన్ స్పందించింది. ఉక్రెయిన్ లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఓటమి గ్రహించి రష్యా మూడో ప్రపంచ యుద్ధం పేరుతో బెదిరిస్తోందని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ కు మద్దతివ్వకుండా ప్రపంచదేశాలను భయపెట్టాలని చూసిన రష్యా చివరకు ఆశలు కోల్పోయిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ లో ఓటమిని రష్యా గ్రహించినట్లు కనిపిస్తోందని పేర్కొంది.

English summary
russia on today warns western countries to face third world war amid their military help to ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X