కీవ్ దిశగా దూసుకెళ్తోన్న రష్యన్ బలగాలు.. కీలక బ్రిడ్జ్‌ను పేల్చేసిన ఉక్రెయిన్ సైన్యం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత పెరిగాయి. బాంబులతో బీభత్సం సృష్టిస్తోంది. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా రష్యా సైన్యం దూసుకెళ్తోంది. పెద్ద ఎత్తున క్షిపణులతో కురిపిస్తుంది. ఇప్పటికే చెర్నోబిల్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కీలకమైన బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్ సైన్యం
ఈనేపధ్యంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యన్ బలగాలు ప్రవేశించకుండా కట్టడి చర్యలకు పూనుకుంది. ఈ నగరానికి సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన బ్రిడ్జిను ఉక్రెయిన్ సైన్యం పేల్చేసింది. ఈ వంతెన కీవ్‌కు ఉత్తర దిక్కున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెటరివ్ నది సమీపంలో ఉంది. రష్యా యుద్ధ ట్యాంకులను రాకుండా నిలువరించేందుకు ఈ వంతెనను కూల్చేసి ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు.

పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు
కీవ్ లోకి ప్రవేశించేందుకు అత్యంత కీలకైన ఈ వంతెనను కూల్చి వేయడం ద్వారా రష్యా సైన్యం దూకుడును కొంత నిలువరించవచ్చు అని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా యుద్ధ ట్యాంకులు వస్తున్నాయి. తాము పోరాడుతున్నామని వెల్లడించింది. రష్యా సేనలను దీటుగా ఎదుర్కొంటున్నామని పేర్కొంది. రష్యా సేనలు సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై కూడా దాడులకు దిగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ప్రజలు నగరంలోని సురక్షిత బంకర్లలోకి వెళ్లాలని కోరారు.












Click it and Unblock the Notifications