తీరంలో తెల్ల తిమింగలం కలకలం

Beluga Whale: తెల్ల తిమింగలం కళేబరం కలకలం రేపుతోంది. నార్వే సముద్ర తీరంలో కనిపించిన ఈ కళేబరం.. రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. రష్యాకు చెందిన స్పై వేల్‌గా భావిస్తోండటమే దీనికి కారణం. గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొనేలా, పొరుగు దేశాల నౌకా దళ సమాచారాన్ని సంగ్రహించేలా రష్యా దీనికి శిక్షణ ఇచ్చిందని అనుమానిస్తోన్నారు.

బెలుగా రకానికి చెందిన వైట్ వేల్ ఇది. వ్లాదిమిర్ అనేది నిక్ నేమ్. నార్వే సముద్ర తీర ప్రాంతం రిసివికా బేలో నిర్జీవంగా కనిపించింది. ఫిషింగ్‌కు కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఈ తిమింగలం కళేబరాన్ని తొలుత గుర్తించారు. దీనిపై స్థాని కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ మైండ్ ఎన్జీఓ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

Russian spy White beluga whale nicknamed Hvaldimir was found dead in Norway

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఈ వైట్ వేల్ కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి తరలించారు. దీని శరీరంపై ప్రాణాంతక గాయాలు ఉన్నట్లు మెరైన్ బయాలజిస్ట్, మెరైన్ మైండ్ ప్రతినిధి సెబాస్టియన్ స్ట్రాండ్ నిర్ధారించినట్లు నార్వే అధికారిక వార్తా సంస్థ ఎన్ఆర్‌కే వెల్లడించింది.

మూడు సంవత్సరాలుగా దీని కదలికలను తాను గమనిస్తోన్నానని, రెండు రోజుల కిందటి వరకూ ఇది పూర్తి ఆరోగ్యంతో ఉండేదని సెబాస్టియన్ తెలిపారు. దాని శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం అనేక అనుమానాలను కలిగిస్తోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ తెల్ల తిమింగలాన్ని రష్యాకు చెందిన స్పై వేల్‌గా భావిస్తోన్నారు. గతంలో దీని శరీరంపై కొన్ని మైక్రో పరికరాలు, కెమెరాలు లభించడమే దీనికి కారణం. ఆ పరికరాలపై ఎక్విప్‌మెంట్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అనే అక్షరాలను ముద్రించి ఉండటం వల్ల ఈ అనుమానాలు తలెత్తాయి. ఈ అనుమానాలపై రష్యా ఎలాంటి వివరణ ఇవ్వలేదు అప్పట్లో. అలాగని ఖండించనూ లేదు.

4.2 మీటర్ల పొడవు, 1,225 కేజీల బరువు ఉండే ఈ బెలుగా వైట్ వేల్‌‌ను 2019లో తొలిసారిగా దీన్ని నార్వే-ఫిన్లాండ్-డెన్మార్క్ తీరంలో కనుగొన్నారు. సాధారణంగా ఈ వైట్ బెలుగా వేల్స్ గ్రీన్‌ల్యాండ్, నార్వే, రష్యా సముద్రంలో సంచరిస్తూ ఉంటాయి. ఆ తరువాత కూడా నార్వే తీరంలో చాలాసార్లు కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+