వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కొన్ని క్షణాల్లో పెళ్ళి, పీటలపై నుండి వరుడు జంప్

కట్నం ఇవ్వలేదనో, అమ్మాయి నచ్చలేదనో, తమ బందువులకు మర్యాదలు చేయలేదనో , లాంఛనాలు ఇవ్వలేదనో వివాహలు ఆగిపోవడం చూసే ఉంటాం. వినే ఉంటాం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రియాద్: కట్నం ఇవ్వలేదనో, అమ్మాయి నచ్చలేదనో, తమ బందువులకు మర్యాదలు చేయలేదనో , లాంఛనాలు ఇవ్వలేదనో వివాహలు ఆగిపోవడం చూసే ఉంటాం. వినే ఉంటాం. కానీ, దుబాయ్‌లో మాత్రం ఆడపిల్ల తండ్రి అడిగిన ఓ కోరికకు వరుడు పెళ్ళి పీటల నుండి లేచి వెళ్ళిపోయాడు.అంతేకాదు ఈ పెళ్ళి రద్దయింది. కొన్ని క్షణాల్లో వివాహం జరగాల్సి ఉండగా వరుడి నిర్ణయం కారణంగా ఏకంగా పెళ్ళే రద్దు చేసుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరం.

పెళ్లైన తర్వాత తన కూతురిని కారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వధువు తండ్రి.. కాబోయే అల్లుడిని కోరాడు. ఈ ఒక్క కారణం ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. తన భార్య కారు నడపడానికి ఏమాత్రం అనుమతి ఇవ్వనని చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సౌదీకి చెందిన యువకుడు.

Saudi groom walks out of his wedding after bride's father insists his daughter is allowed to drive a car when ban is lifted

మహిళలు డ్రైవింగ్ చేయవచ్చంటూ సౌదీ రాజు సాల్మాన్ గర్వంగా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన వెలుగులోకి రావడం శోచనీయం. సౌదీలోని మహిళలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా వారి సంరక్షల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే చట్టం అమల్లో ఉంది. దీంతో తన భార్య కారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనని వరుడు చెప్పడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.

ఇదిలావుండగా.. మహిళలు డ్రైవింగ్ చేయకూడదని నిబంధన కలిగివున్న ఏకైక దేశం ఏదని ప్రశ్నిస్తే ఒకప్పుడు సౌదీఅరేబియా పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. సౌదీ రాజు సాల్మాన్ చరిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. మహిళలు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇస్తున్నామని గర్వంగా ప్రకటించారు. 2018 జూన్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది

ఈ ప్రటకనతో సౌదీ మహిళలు సంబరాల్లో మునిగారు. అంతర్జాతీయంగా సౌదీకి ప్రశంసలు అందాయి. నిర్ణయంపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ కారు డ్రైవింగ్ చేస్తానంటే ఒప్పుకోకపోవడమే కాకుండా పెళ్లి రద్దైన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

English summary
Saudi groom walks out of his wedding after bride's father insists his daughter is allowed to drive a car when ban is lifted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X